Reading Time: < 1 minute
Chiru 158 Megastar Chiranjeevi Bobby Movie Mafia Flashback Update

Chiru158: ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి – మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చిరంజీవి కెరీర్‌లో 158వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి తాజాగా ఒక సెన్సేషనల్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా కథలో సెకండ్ హాఫ్ అత్యంత కీలకంగా ఉండబోతుందని సమాచారం. ముఖ్యంగా ఇందులో ఒక భారీ యాక్షన్ ఫ్లాష్‌బ్యాక్ సీక్వెన్స్‌ను బాబీ డిజైన్ చేశారట. ఈ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో మెగాస్టార్ పాత్ర మాఫియా నేపథ్యంలో సాగుతుందని, వింటేజ్ చిరంజీవిని గుర్తుకు తెచ్చేలా అత్యంత శక్తివంతంగా ఉంటుందని తెలుస్తోంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, ఈ పాత్ర చుట్టూ ఒక బలమైన ఎమోషనల్ డ్రామాను కూడా బాబీ ప్లాన్ చేసినట్లు టాక్.

READ ALSO: Telangana : సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్

మెగాస్టార్‌ను మునుపెన్నడూ చూడని రీతిలో, సరికొత్త మాస్ అవతార్‌లో చూపించాలనే పట్టుదలతో బాబీ ఈ కథను సిద్ధం చేశారట. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌ కూడా ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. చిరు ఇమేజ్‌కు తగ్గట్టుగా, అభిమానులు కోరుకునే అన్ని అంశాలను జోడిస్తూనే ఒక వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమా రాబోతోందని చెబుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వెంకట్ కె.నారాయణ – లోహిత్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. గతంలో చిరు – బాబీ కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ను మించి ఈ సినిమాను రూపొందించనున్నట్లు తెలుస్తుంది.

READ ALSO: IPL 2026: సన్‌రైజర్స్‌ ఓటమికి బాధ్యులు ఎవరో చెప్పిన ఎస్‌ఆర్‌హెచ్ హెడ్ కోచ్!