Reading Time: < 1 minute
పావురాలను తరిమికొట్టే పవర్ ఫుల్ ఐడియా.. ఇలా చేస్తే.. మళ్లీ ఇంటి దరిదాపుల్లోకి కూడా అడుపెట్టవు!

పావురాలు.. ఈ రోజుల్లో నగరాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ వంటి మెట్రో సిటీలలో అపార్ట్‌మెంట్‌లలో నివసించే వారికి పెద్ద సమస్యగా మారిపోయాయి. వీటి బెడద కారణంగా చాలా మంది బాల్కనీలో కూర్చోలేక పోతున్నారు, బట్టలు ఆరవేయలేకపోతున్నారు. చూడ్డానికి అందంగా కనిపించే ఈ పావురాలు రెట్టలు వేసి ఇంటి మొత్తాన్ని మురికి చేయడమే కాకుండా, ఆరోగ్యానికి కారణం అవుతాయి. కాబట్టి ఇవి ఇంట్లో రావడానికి గల మెయిన్ రీజన్స్ తెలుసుకొని వాటిని ఇంట్లోకి రాకుండా ఎలా నివారించాలో తెలుసుకుందాం.

పావురాలు ఇంట్లోకి రాకుండా పాటించాల్సిన చిట్కాలు

పరిశుభ్రత: పావురాలను ఇంట్లో నుంచి తరిమికొట్టేందుకు మొదటి మెట్టు శుభ్రత. పావురాలు వాటి రెట్టల వాసన ద్వారా తమ స్థావరాన్ని గుర్తుంచుకుంటాయి. ఆ వాసన లేకపోతే అవి తిరిగి రావడానికి ఇష్టపడవు. కాబ్టి మీ బాల్కనీని ప్రతిరోజూ శుభ్రం చేసుకోండి. దీని వల్ల పావురాలను ఇంట్లోకి రానివ్వకుండా చేయవచ్చు. వీటిని శుభ్రం చేసేటప్పుడు కచ్చితంగా మాస్క్ మరియు గ్లౌజులు ధరించండి.

అల్యూమినియం ఫాయిల్: అల్యూమినియం ఫాయిల్ ముక్కలను కట్ చేసి బాల్కనీ రెయిలింగ్స్ లేదా కిటికీల దగ్గర వేలాడదీయండి. ఎందుకంటే సూర్యరశ్మి ఆ ఫాయిల్‌పై పడి మెరిసినప్పుడు, ఆ కాంతికి భయపడి పావురాలు దూరంగా వెళ్లిపోతాయి.

పక్షి బొమ్మలు: మార్కెట్లో దొరికే ప్లాస్టిక్ గుడ్లగూబలు లేదా డేగ వంటి బొమ్మలను మీ ఇంటి కిటికీలు లేదా బాల్కనీలో లేదా పావురాలు వచ్చే చోట ఉంచండి. వాటిని నిజమైన పక్షులుగా భావించి పావురాలు భయపడి అక్కడికి రాకుండా ఉంటాయి.

విండ్ చైమ్స్: మీ బాల్కనీలో అందమైన విండ్ చైమ్స్‌ను వేలాడదీయండి. గాలికి అవి చేసే శబ్దం పావురాలకు చికాకు కలిగిస్తుంది, దీనివల్ల అవి మీ ఇంటి దరిదాపుల్లోకి రావు.

బర్డ్ స్పైక్స్ : ఇవి ప్లాస్టిక్ లేదా స్టీల్‌తో చేసిన ముళ్ల వంటివి. వీటిని కిటికీల పైన, AC అవుట్‌లెట్ల మీద లేదా బాల్కనీ రెయిలింగ్‌లపై అమర్చడం వల్ల పావురాలు అక్కడ వాలడానికి వీలుండదు. ఇది చాలా శాశ్వతమైన పరిష్కారం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.