Reading Time: < 1 minute

అమరావతి: ఇంట్లో ఎసి పేలడంతో ఒకరు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… రేబాక్ రామారావు రిటైర్ మెంట్ అయిన తరువాత ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇంట్లో ఆయన నిద్రిస్తున్న సమయంలో ఎసి పేలడంతో మంటలు చెలరేగాయి. ఆయన పడుకున్న మంచానికి మంటలు అంటుకోవడంతో రామారావు సజీవదహనమయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ తోనే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.