Reading Time: 2 minutes
చిన్నచూపు చూడొద్దు.. ఈ సమస్యలకు దివ్యౌషధం.. ఈ ఆకు రసంతో ఇలా చేశారంటే..

బొప్పాయి పండు అనేక పోషకాలకు మూలం.. కాగా, దాని ఆకులు సైతం అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ కారణంగానే బొప్పాయి ఆకులను ఆయుర్వేద మందుల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు. బొప్పాయి ఆకుల రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుండి రక్షణ పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బొప్పాయి ఆకులను జ్యూస్ చేసి తాగడం ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తిని గణనీయంగా పెంచుకోవచ్చు. ఈ జ్యూస్ జ్వరాలు రాకుండా రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. బొప్పాయి ఆకుల రసంలో విటమిన్లు ఏ, ఈ, సి, కె, బి లు అధికంగా లభిస్తాయి.. ఇవి శరీర ఆరోగ్యానికి అత్యవసరం. షుగర్ లెవెల్స్‌ను నియంత్రణలో ఉంచడంలో బొప్పాయి ఆకుల రసం సహాయపడుతుంది. ముఖ్యంగా, శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచగల సామర్థ్యం దీనికి ఉందని, తద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయని పరిశోధనలు తేల్చాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇది అద్భుతంగా పనిచేస్తుందని నిరూపితమైంది.

మలబద్ధకం సమస్యలతో బాధపడుతున్న వారికి బొప్పాయి ఆకు జ్యూస్ మంచి పరిష్కారం చూపుతుంది. దీనిని తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి కూడా ఇది తోడ్పడుతుంది. జుట్టు సంరక్షణలోనూ బొప్పాయి ఆకుల రసం కీలక పాత్ర పోషిస్తుంది. చుండ్రు, జుట్టు రాలిపోవడం, తలలో దురద వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ రసాన్ని తలకు పట్టిస్తే ప్రయోజనం ఉంటుంది. జుట్టు తెల్లబడటం, సన్నగా అయిపోవడం వంటి సమస్యలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. జుట్టుకు మెరుపును అందించి, షాంపూ, కండిషనర్ లాగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు.

బొప్పాయి ఆకుల్లో ఫెనోలిక్ కాంపౌండ్, పపాయిన్, ఆల్కలాయిడ్స్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. క్యాన్సర్ రాకుండా నివారించడంలో కూడా బొప్పాయి ఆకుల రసం ఉపయోగపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆహారం సరిగ్గా అరగక, కడుపు ఉబ్బరంగా ఉండే వారికి ఒక టేబుల్ స్పూన్ బొప్పాయి రసం చాలా మేలు చేస్తుంది.

పొట్టలో గ్యాస్, అల్సర్, నొప్పి వంటి జీర్ణ సంబంధిత సమస్యలను ఇది నివారిస్తుంది. మహిళల్లో రుతుక్రమ సమస్యలను సరిచేయడంలో, శరీరంలో హార్మోన్లను క్రమబద్ధీకరించడంలో కూడా బొప్పాయి ఆకుల రసం బాగా ఉపయోగపడుతుంది. ఈ అద్భుతమైన సహజ ఔషధంతో ఆరోగ్యకరమైన జీవనాన్ని పొందవచ్చు.

అయితే.. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే.. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే.. వెంటనే వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..