Reading Time: 2 minutes

Mrithyunjay OTT: ఓటీటీలోకి ట్విస్టులతో కట్టిపడేసిన క్రైమ్ మిస్టరీ.. ‘మృత్యుంజయ్’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Caption of Image.

శ్రీవిష్ణు హీరోగా సుకుమార్ శిష్యుడు హుస్సేన్ షా కిర‌‌‌‌‌‌‌‌ణ్ దర్శకత్వంలో వచ్చిన రీసెంట్ మూవీ ‘మృత్యుంజ‌‌‌‌‌‌‌‌య్‌‌‌‌‌‌‌‌’(Mrithyunjay). మార్చి 6న విడుదలైన సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. హుస్సేన్ రైటింగ్, ట్విస్ట్‌‌‌‌‌‌‌‌లు బాగా వర్కవుట్ అయ్యాయి. తెలుగులో చాలా అరుదుగా వచ్చే థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌లో ఇదొకటి. సినిమాలో పాటలు, కామెడీ సీన్లు ఉండవు. కేవలం కంటెంట్‌‌‌‌‌‌‌‌తోనే ఆడియెన్స్ను ఎంగేజ్ చేసింది. ఇపుడు ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. 

లేటెస్ట్గా నెట్‌ఫ్లిక్స్ (Netflix) అప్‌కమింగ్‌ చిత్రాల జాబితాలో ‘మృత్యుంజయ్’ స్ట్రీమింగ్ డేట్ని అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్‌ 3న ఓటీటీలోకి రానుందని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. మైండ్ గేమ్ ఎలిమెంట్స్‌తో నడిచే థ్రిల్లర్ కథ కావడంతో ఓటీటీ ప్రేక్షకులు ఈజీగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా స్టోరీ, స్క్రీన్ ప్లే, శ్రీవిష్ణు యాక్టింగ్ సినిమాకు బలంగా నిలిచింది. ఇందులో శ్రీ విష్ణుకి జంటగా రెబా జాన్ నటించి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. 

మృత్యుంజయ్ కథ:

హైదరాబాద్‌లో ఒక పేపర్ అడ్వర్టైజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో జయ్‌ (శ్రీ విష్ణు) ఉద్యోగం చేస్తాడు. ‘శ్రద్ధాంజలి’ ప్రకటన ఇవ్వించడమే అతని పని. అయితే, ఎప్పటికైనా క్రైమ్ రిపోర్టర్ కావాలని కలలు కంటున్న అతను, ఒక వారం వ్యవధిలో అనుమానాస్పదంగా జరిగిన రెండు మరణాలపై సందేహం పెంచుకుంటాడు.

వాటిలో ఒకటి చిన్నారి అంజలి (ఊహా రెడ్డి) తండ్రి అచ్యుత్‌రావు (బాలాదిత్య) మరణం. అది సహజ మరణం కాదని.. హత్య చేయబడిందని జయ్ అనుమానించి, ఏసీపీ సీతగా (రెబా మౌనిక జాన్) దృష్టికి తీసుకెళ్తాడు. అయితే ఆమె అది ప్రమాదమని భావిస్తుంది. చివరికి జయ్ తన అనుమానాన్ని ఎలా నిరూపించాడు? ఆ హత్యల వెనక నిజం ఏమిటి? అనేదే సినిమా కథ.

సినిమా ఎలా ఉందంటే:

ఇటీవల వరుసగా కామెడీ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన శ్రీ విష్ణు ఈసారి పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించాడు. కథలోని మైండ్ గేమ్, మిస్టరీ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆసక్తిగా సీట్లో కూర్చోబెట్టేలా ఉంది. దర్శకుడు హుస్సేన్ కథను నెమ్మదిగా మిస్టరీ వైపు తీసుకెళ్లే విధానం బాగుంది. ఫస్టాఫ్ పాత్రల పరిచయంతో సాగితే, సెకండాఫ్లో ప్రేక్షకులను కట్టిపడేసింది.

చైల్డ్ సెంటిమెంట్‌, మైండ్ గేమ్‌తో నడిచే స్క్రీన్ ప్లే, పూర్తిగా సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు సినిమాకి ప్రధాన బలం. గ్రిప్పింగ్ కథను చెప్పడంలో దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ తన ప్రతిభను చక్కగా చూపించాడు. మొత్తానికి  ‘మృత్యుంజయ్’ ఒక ఆసక్తికరమైన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. మిస్టరీ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా మంచి థ్రిల్ ఇస్తుంది.

©️ VIL Media Pvt Ltd.