
హిందూ పురాణాలకు.. ఆధ్యాత్మికతకు.. ఆరోగ్యానికి చాలా దగ్గర సంబంధాలున్నాయి. ప్రతిపూజకు.. ప్రసాదాలకు.. శివతాండవం లాంటి మంత్రాల ద్వారా ఆరోగ్యం చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. శివతాండవం చదవడం వలన మెడడు చురుకుగా పనిచేస్తుందని.. ఆలోచనల శక్తి పెరుగుతుందని ఇంకా ఆందోళనలు తగ్గి మనస్సుకు ప్రశాంతత కలుగుతుందని పండితులు.. నిపుణులు చెబుతున్నారు.
ప్రాచీన భారతదేశంలో మన ఋషులు ధ్వనికి ప్రత్యేకమైన శక్తిఉంటుందని వేల ఏళ్ల క్రితమే గుర్తించినట్లు చరిత్ర చెబుతోంది. పరమేశ్వరుడి అనుగ్రహం కలగాలంటే శివతాండవం స్తోత్రం చాలా ముఖ్యమైనది. ఇది అత్యంత శక్తివంతమైనది. రావణాసురుడు రచించిన ఈ స్తోత్రంలో అనేక శక్తివంతమైన పదాల కలయిక ఉంది. దీనిని చదివేటప్పుడు వచ్చే శబ్దంలో ఒక అద్భుతమైన ధ్వని శాస్త్రం దాగి ఉందని సైన్స్ ద్వారా తెలుస్తుంది.
సైంటిస్టులు చెబుతున్న వివరాల ప్రకారం… ప్రతి శబ్దానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. కొన్ని పదాలు.. సంస్కృత వాక్యాలు పలికినప్పుడు మనిషి శరీరంలోని నాడీ వ్యవస్థపై మనకు తెలియకుండానే లోతైన ప్రభావాన్ని చూపుతాయి. అందుకే ఆవేశంగా మాట్లాడేటప్పుడు మనకు తెలియకుండా శరీరంలోని కొన్ని భాగాలు కదులుతాయి. అలాగే శివతాండవ స్తోత్రాన్ని చదువుతున్నా… శ్రద్దగా వింటున్నా.. మెదడులో ప్రకంపనలు మొదలవుతాయి. వీటి వలన మనసులోని ఆందోళనలు తగ్గి మనిషి పరివర్తనలో మార్పు వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఒత్తిడిలో ఉన్న సమయంలో మెదడులోని బీటా తరంగాల ప్రకంపనలు ఎక్కువుగా ఉంటాయి. కాని శివ తాండవం స్తోత్రంలోని జటాటవీ గలజ్జల ప్రవాహపావితస్థలే వంటి పదాలు చదువుతున్న సమయంలో .. అలాంటి లయబద్దమైన పదాలను వినే సమయంలో మన మెదడుకు నెమ్మదిగా ఒత్తిడి తగ్గి, రిలాక్స్‌డ్ మోడ్‌లోకి వెళుతుంది. దీనిని సైన్సు భాషలో ఆల్ఫా స్థితి అంటారు. ఈ స్థితిలో కొత్త ఆలోచనలు వచ్చి సమాచారాన్ని త్వరగా గ్రహించగల శక్తిని కలిగి ఉంటామని పలు పరిశోధనల ద్వారా రుజువైనట్లు సైంటిస్టులు చెబుతున్నారు.
మెదడు ఆల్ఫా స్థితిలో ఉన్నప్పుడు మనిషికి ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతుందట. ఈ స్తోత్రంలో ప్రత్యేకమైన పదాలు ఉండటం వల్ల దీనిని పఠించేటప్పుడు శ్వాసక్రియ క్రమబద్ధంగానే సాగి.. ఒక రకమైన ప్రాణాయామంలా పనిచేస్తుంది. . దీని వల్ల శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలు పెరగడంతో పాటు, రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది.
సౌండ్ థెరపీ.. ధ్వని చికిత్సకు ఇంపార్టెన్స్ ఈ మధ్య కాలంలో పెరిగింది. మన ఋషులు ఈ ధ్వని శక్తిని వేల ఏళ్ల క్రితమే గుర్తించినట్లు చరిత్ర చెబుతోంది. అందుకే ఈ స్తోత్రం పఠించేటప్పుడు మనలో మనకు తెలీకుండానే ఓ రకమైన ఉత్సాహం, ధైర్యం కలుగుతాయి.
శివ తాండవ స్తోత్రం కేవలం ఆధ్యాత్మిక అంశం మాత్రమే కాదు.. మనిషి అంతరాత్మను, మెదడు పనితీరును కూడా మెరుగుపరిచే ఒక గొప్ప సైన్స్ అని తేలింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది శాస్త్రవేత్తలు కూడా మన సంస్కృత శ్లోకాల వల్ల కలిగే మానసిక ప్రయోజనాలపై పరిశోధనలు చేశారు.. ఇంకా చేస్తున్నారు. అటువంటి పరిశోధనలకు మన శివ తాండవ స్తోత్రం ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.