Reading Time: < 1 minute

నేపాల్‌లో దేశ మాజీ ఇంధన మంత్రి , నేపాలీ కాంగ్రెస్ నేత దీపక్ ఖడ్కాను ఆదివారం అరెస్టు చేశారు. మనీలాండరింగ్ కేసు సంంధిత అవినీతి వ్యవహరంలో నూతన ప్రభుత్వం ఈ చర్యకు దిగింది. కీలక మంత్రిత్వ శాఖను నిర్వహించిన ఖడ్కాపై దేశ దర్యాప్తు సంస్థ సిఐబి ప్రాధమిక విచారణ జరిపింది. ఆదివారం ఉదయం అదుపులోకి తీసుకుందని సంస్థ అధికార ప్రతినిధి శివకుమార్ శ్రేష్ట చెప్పినట్లు స్థానిక మీడియా హిమాలయన్ తెలిపింది.

సిఐబి ఆదేశాల మేరకు పోలీసులు అరెస్టుకు దిగారు. గత ఏడాది నేపాల్‌లో జరిగిన యువత నిరసన ప్రదర్శనలు, అవినీతి వ్యతిరేక ఉద్యమం దశలో అప్పటి ప్రభుత్వ అవినీతి విషయాలు ప్రధానంగా వెలుగులోకి వచ్చాయి. ఖడ్కా, మాజీ ప్రధానులు షేర్ బహదూర్, పుష్ప కమల్ దహల్ నివాసాలలో కాలిపోయిన నోట్ల కట్టలు కన్నించాయని పేర్కొంటూ ఫోటోలను, వీడియోలను నిరసనకారులు ప్రదర్శించారు. దీని ఆధారంగా ఇప్పుడు దర్యాప్తు సాగుతోంది.