
తెలుగు చిత్ర పరిశ్రమలో వందకు పైగా చిత్రాలను తెరకెక్కించి ‘శతాధిక దర్శకుడు’గా పేరు తెచ్చుకున్నాడు రాఘవేంద్రరావు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణంలోని మధుర స్మృతులను, అలాగే తీరని వేదనను పంచుకున్నారు. ఈ సందర్భంగా దివంగత నటి శ్రీదేవి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు అందరినీ కలచివేస్తున్నాయి. ‘ఆమె లాంటి చావు మరెవరికీ రావొద్దు’ అంటూ ఆయన అత్యంత భావోద్వేగానికి గురయ్యారు.
Also Read : Fauji; ‘ఫౌజీ’ సినిమాపై జయప్రద క్లారిటీ!
శ్రీదేవితో రాఘవేంద్రరావు కలయికలో దాదాపు 24 సినిమాల అనుబంధం ఉంది. ముఖ్యంగా ఆమెను వెండితెరపై ఒక దేవతలా చూపించడంలో ఆయన శైలే వేరు. తన చివరి చిత్రం ‘మామ్’ ఆడియో ఫంక్షన్‌లో శ్రీదేవి తన కాళ్లపై పడి నమస్కరించిందని, మళ్ళీ కలిసి ఒక సినిమా చేద్దామని కోరిందని ఆయన గుర్తు చేసుకున్నారు. కానీ, ఆ తర్వాత కొద్దిరోజులకే ఆమె బాత్ టబ్‌లో పడి అనుమానాస్పద స్థితిలో మరణించడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘అంతటి గొప్ప నటి, ఇండస్ట్రీకి ఎంతో సేవ చేసిన అతిలోక సుందరి.. అలా దేవలోకానికి వెళ్లిపోకూడాల్సింది. ఆమెలాంటి చావు మరేవ్వరికి రాకుడదు’ అంటూ ఆయన కన్నీరు పెట్టుకున్నారు. రాఘవేంద్రరావు మాటలతో మరోసారి శ్రీదేవి అభిమానులు ఆమెను గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతున్నారు.