Reading Time: 2 minutes

రూ.4 వేల కోట్ల ఖర్చుతో.. తెలంగాణలో 118 ATC సెంటర్లు: మంత్రి వివేక్ వెంకట స్వామి

Caption of Image.

స్కిల్స్​ డెవలప్​ మెంట్ కోసం రాష్ట్రంలో ప్రత్యేకంగా  స్కిల్​ డెవలప్​ మెంట్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి. టాటా యాజమాన్యంతో చర్చలు జరిపి 4వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా అడ్వాన్స్​ డ్​ ట్రైనింగ్​ సెంటర్లు(ATC) సెంటర్లను తెచ్చామన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలతో సహా 118 ఏటీసీలను ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ రైసింగ్​ 2034 లో రాష్ట్ర  ఎకానమీని 1 ట్రిలియన్​ డాలర్లకు చేయాలని 2047లో 3 ట్రిలియన్​ డాలర్​ ఎకానమి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.. దీంతో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఎక్కువ పెట్టుబడులు వస్తాయి. ఆర్థికాభివృద్ది జరుగుతుంది.. తద్వారా రాష్ట్రంలోని యువతకు  ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని కార్మిక శాఖ మంత్రి వివేక్​ వెంటకస్వామి అన్నారు. ఇందులో భాగంగా పరిశ్రమలకు కావాల్సిన స్కిల్​ డెవలప్​ మెంట్ కోసం ఏటీసీలను ఏర్పాటు చేశామన్నారు. 

సీఎం రేవంత్​ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దావోస్​ వెళ్లి చాలామంది పారిశ్రామిక వేత్తలో మాట్లాడి పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేశారు. సుమారు రూ.7లక్షల కోట్ల పెట్టుబడులను  తీసుకొచ్చారు. పరిశ్రమల స్థాపన, అభివృద్దికి అడ్వాన్డ్‌ టెక్నాలజీ సెంటర్లు కావాలని రాష్ట్రప్రభుత్వం టాటా యాజమాన్యంతో చర్చించి రూ. 4వేలకోట్ల పెట్టబడులు, ఇంతకుముందున్న ఐటీఐల స్థానంలో కొత్తగా ఏటీసీ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. 53 కొత్త టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు తీసుకొచ్చామన్నారు.  మారుమూల యువతకు కూడా అవకాశాలు కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా 118 ఏటీసీ సెంటర్ల స్థాపన జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే పరిశ్రమలకు అవసరమైన స్కిల్స్​, టెక్నాలజీని ఈ సెంటర్ల ద్వారా అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ ఏటీసీ సెంటర్ల ద్వారా సుమారు 28 వేల మందికి శిక్షణ ఇస్తామని చెప్పారు. 

మారుమూల ప్రాంతాల్లో వ్యవసాయ పరిశ్రమలకు అవసరమైన  కొత్త కోర్సులను ఈ సెంటర్ల ఇంట్రడ్యూస్​ చేస్తున్నామన్నారు మంత్రి వివేక్​ వెంకటస్వామి. ఏఐ డ్రోన్​ టెక్నాలజీ, ఎలక్ట్రిక్​ వెహికల్స్​ తయారీ రంగంలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి.. ఆ పరిశ్రమలకు అవసరమైన  టెక్నాలజీని , స్కిల్స్​ ను అందింస్తామన్నారు. శిక్షణ పొందే సమయంలో వారికి 2వేల రూపాయల  స్టయిఫండ్​ ఇస్తామని సీఎం ప్రకటించారని చెప్పారు. జూన్​ నుంచి ఏటీసీ ద్వారా  కోర్సులను ప్రారంభిస్తామన్నారు. దేశంలోనే బెస్ట్​ స్కిల్స్​ డెవలప్​ మెంట్ సెంటర్లుగా తీర్చిదిద్దుతామన్నారు. 
ఓవర్​ సీస్​ ఎంప్లాయ్​ మెంట్ కావాల్సిన స్కిల్స్​ అందించేందుకు  టామ్​ కామ్ ద్వారా 90కోట్లు కేటాయించారు. ప్రత్యేకంగా లాంగ్వేజ్​ డెవలప్​ మెంట్ కోసం మరో 30కోట్లు బడ్జెట్ లోకేటాయించామన్నారు మంత్రి. 

©️ VIL Media Pvt Ltd.