
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఘనంగా ప్రారంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన బ్లాక్‌బస్టర్ మ్యాచ్‌లో 202 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ హాఫ్ సెంచరీతో చెలగడంతో కేవలం వికెట్లు మాత్రమే కోల్పోయి గెలిచింది. కాగా ఫీల్డింగ్ లో అద్భుతమైన క్యాచులు అందుకున్న ఫిల్ సాల్ట్ మాత్రం బ్యాటింగ్ లో పెద్దగా రాణించలేదు. కేవలం 8 పరుగులు చేసి జయదేవ్ ఉనద్కత్ బౌలింగ్ లో పెవిలియన్ కి వెళ్లిపోయాడు. అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన పడిక్కల్ ( 26 బంతుల్లోనే 7 ఫోర్లు, 4 సిక్సులతో 61 పరుగులు) హాఫ్ సెంచరీ చేసిన తర్వాత హర్ష్ దూబే బౌలింగ్ లో క్లాసెన్ కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
మరోవైపు విరాట్ కోహ్లీ నిలకడగా బ్యాటింగ్ చేస్తూ (38 బంతుల్లోనే 5 ఫోర్లు 5 సిక్సులతో 69 పరుగులు ) అర్థ శకతం కొట్టాడు. పడిక్కల్ ఔట్ అయిన తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ క్రీజులోకి రావడం రావడంతోనే ఎస్ఆర్హెచ్ బౌలర్లపై విరుచుకు పడ్డాడు. కేవలం 12 బంతుల్లోనే 31 పరుగులు చేసిన తర్వాత డేవిడ్ పేన్ బౌలింగ్ లో హర్ష్ దూబేకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన వికెట్ కీపర్ జితేష్ శర్మ డేవిడ్ బౌలింగ్ లోనే గోల్డెన్ డక్ అయ్యాడు. దీంతో వరస బంతుల్లోనే అతడు రెండు వికెట్లు పడగొట్టిన ఆర్సీబీని ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేసినప్పటికీ చివరి వరకు క్రీజులో నిలిచన కింగ్ కోహ్లీ మ్యాచుని ముగించేశాడు.
3⃣1⃣ off 1⃣2⃣ 💪
That was an impactful knock from #RCB captain Rajat Patidar in the chase 🔥
Updates ▶️ https://t.co/Eo5z0jh4K4 #TATAIPL | #KhelBindaas | #RCBvSRH | @RCBTweets | @rrjjt_01 pic.twitter.com/9gSJwRjQYN
— IndianPremierLeague (@IPL) March 28, 2026