
చిరుత సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు రామ్ చరణ్. మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా సినిమాల్లోకి అడుగుపెట్టిన చెర్రీ.. చాలా తక్కువ టైంలోనే తన టాలెంట్‌తో స్టార్ హీరోగా ఎదిగాడు. మగధీర సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న చరణ్.. తర్వాత చేసిన సినిమాలతోనూ అభిమానులను అలరించారు.
ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో లెక్కల మాస్టారుగా పాపులర్ అయిన సుకుమార్‌తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చరణ్. రంగస్థలం టైటిల్‌తో సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. అప్పటివరకు స్లైలిష్ లుక్‌లో కనిపించిన చరణ్‌ను డిఫరెంట్ లుక్‌లో పరిచయం చేశారు సుకుమార్. ఫస్ట్ లుక్ రిలీజ్ నుంచి చాలా మంది సినిమా గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. చరణ్ లుక్స్ చూసిన అభిమానులు కొత్తగా ఉందని ఆనందపడినా.. తమ హీరో ఇటువంటి క్యారెక్టర్‌లో నటిస్తున్నారా? రగ్గెడ్ లుక్, పంచె, పాత కాలం నాటి షర్ట్.. వీటన్నింటినీ మించి సినిమాలో హీరోకు చెవులు వినిపించవు.
నిర్ణయమే సాహసం..
ఇటువంటి కథకు చరణ్ కాకుండా ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్న హీరో ఎవరైనా సినిమా చేయాలంటే ఆలోచిస్తారు. కానీ సుకుమార్ మీద ఉన్న నమ్మకంతో చరణ్ ఓకే చెప్పారు. కట్ చేస్తే సినిమా సూపర్‌హిట్. అంతేనా.. ఫ్యాన్స్ ఊహించని విధంగా నటించిన చరణ్.. వారందరినీ ఆశ్చర్యపోయారు. సినిమా కథ, నడిపించిన తీరు.. సమంత, చరణ్ మధ్య సన్నివేశాలు, జగపతిబాబు నటన, ప్రకాష్‌రాజ్ నట విశ్వరూపం ఇవన్నీ కలిసి సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేశాయి.
Ram Charan Rangasthalam
రంగస్థలం సినిమాలో చరణ్ నటనకు మెగాస్టార్ చిరంజీవి కూడా ఫిదా అయ్యారు. కథలో వచ్చే ట్విస్ట్ సినిమాకు హైలైట్. సినిమా హిట్‌కు సూపర్ హిట్ మ్యూజిక్ కూడా కారణం. అనసూయ, ఆది పినిశెట్టి, రాజీవ్ కనకాల తమ పాత్రలకు ప్రాణం పోశారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. 2018, మార్చి 30వ తేదీన రిలీజైన రంగస్థలం సినిమా విడుదలై ఈరోజుకి 8 ఏళ్లు పూర్తయ్యింది. ప్రస్తుతం రామ్ చరణ్.. గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా చరణ్ స్టార్ ఇమేజ్ మరింత పెంచాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ చరణ్..