Reading Time: < 1 minute

సిరికొండ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్న ఆనవాళ్లు బైటపడ్డాయని అటవీ ప్రాంతానికి ఆనుకొని వున్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా వుంటూ జాగ్రత్త చర్యలు పాటించాలని ఆర్మూర్ సబ్ డివిజనల్ ఫారెస్టు అధికారి భవాణి శంకర్ కోరారు. ఆదివారం ఆయన సిరికొండ, కమ్మర్‌పల్లీ రెంజ్ అధికారులు నర్సింగ్‌రావు,రవీంధర్‌లు సిబ్బందితో కలిసి జినిగ్యాల అటవీ ప్రాంతంలో పర్యటించారు. పెద్దపులి సంచారంపై అనావాళ్ల గురించి క్షుణ్ణంగా పరిశీలన జరిపారు. జినిగ్యాల ఫారెస్టు కంపార్టుమెంటులో పులి అడుగులు కనబడ్డాయి. అవి పెద్దపులి అడుగులాగా నిర్ధారించుకున్నారు. అనంతం ఎస్‌డిఎఫ్‌ఒ భవాణి శంకర్ సిబ్బందితో సమావేశమయ్యారు.

పులి సంచారం నిర్ధారణ అయిన దృష్టా అటవీ సరిహద్దు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.పొద్దుకుంగిన తర్వాత,తెల్లవారు జామున, రాత్రి సమయంలో అటవిలోకి వెల్ల వద్దని సూచించారు.అడవులకు ఆనుకొని వున్న పంటపోలాల వద్ద విద్యత్ తీగలు అమర్చవద్దని,అడవి జంతువుత వల్ల ఏవైనా జీవాలకు ప్రాణ నష్టం జరిగితే అటవీ శాఖ అధికారుల దృష్టికి తేవాలని అలా చేస్తే నష్టపరిహారం పొందవచ్చుచనిని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో పెద్దపులి ప్రాణానికి నష్టం చేసే చర్యలకు పూనుకోవద్దని ప్రజలకు తెలిపారు. ఆయన వెంట సిరికొండ డిఆర్‌ఓ గంగారాం,సెక్షన్ అధికారులు,బీట్ అఫీసర్లు వున్నారు.