Reading Time: 2 minutes

ఎవరీ బల్జీత్ సింగ్ : న్యూజిలాండ్ డ్రగ్స్ మాఫియాలో కీ రోల్.. ఇందిరాగాంధీని చంపిన హంతకుల్లోని ఒకరి మేనల్లుడు..!

Caption of Image.

న్యూజిలాండ్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ కేసులో భారత సంతతికి చెందిన బల్తేజ్ సింగ్ (32) అనే వ్యక్తికి 22 ఏళ్ల జైలు శిక్ష పడింది. బల్తేజ్ సింగ్ పైకి ఒక సాధారణ వ్యాపారిగా కనిపిస్తూ, పెద్ద డ్రగ్ మాఫియానే నడిపించాడు. 

ఎవరీ బల్తేజ్ సింగ్ 
ఆక్లాండ్‌లో నివసించే బల్తేజ్ సింగ్ కుటుంబం 1980లలో న్యూజిలాండ్‌కు వలస వెళ్లింది. అక్కడ ఆయన ఒక కిరాణా షాపు నడుపుతూ చిన్న వ్యాపారవేత్తగా అందరికీ తెలుసు. అయితే, ఆయనకు ఒక చారిత్రక బ్యాక్ గ్రౌండ్ కూడా ఉంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీని చంపిన వారిలో ఒకరైన సత్వత్ సింగ్‌కు బల్తేజ్ సింగ్ బంధువు.

హనీ బేర్’ డ్రగ్స్ కేసు
2023లో న్యూజిలాండ్ పోలీసులు జరిపిన భారీ దాడుల్లో బల్తేజ్ సింగ్ అసలు రంగు బయటపడింది. కెనడా నుండి వచ్చిన ‘హనీ బేర్’ అనే బీర్ క్యాన్లలో ద్రవం  రూపంలో ఉన్న మెథాంఫేటమిన్ (డ్రగ్స్)ను దాచి తెచ్చారు.  అయితే పోలీసుకు చేసిన దాడుల్లో సుమారు 700 కిలోల డ్రగ్స్‌  గుర్తించారు. దీని విలువ మన భారతీయ కరెన్సీలో దాదాపు రూ.180 కోట్లు. అలాగే న్యూజిలాండ్ చరిత్రలో ఇదే అతిపెద్ద డ్రగ్స్ కేసు.

 నరహత్య కేసు
ఈ కేసులో మరో ట్విస్ట్ కూడా ఉంది. డ్రగ్స్ ఉన్న ఆ బీర్ క్యాన్‌ను పొరపాటున తాగిన ఐడెన్ సగాలా (21) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బల్తేజ్ సింగ్‌పై కేవలం డ్రగ్స్ కేసు మాత్రమే కాకుండా, నరహత్య కేసు కూడా నమోదైంది. దింతో బల్తేజ్ సింగ్ దుబాయ్‌కి పారిపోయేందుకు ఆక్లాండ్ విమానాశ్రయంలో ఉండగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఆ టైంలో  అతని దగ్గర రూ.8 లక్షలకు పైగా డబ్బు దొరికింది.

 2025 ఫిబ్రవరిలో కోర్టు ఆయనకు 22 ఏళ్ల జైలు శిక్ష విధించింది. డ్రగ్స్ దిగుమతి, ఒక వ్యక్తి మరణానికి కారణమైనందుకు ఈ  శిక్ష పడింది. మొదట్లో తన ప్రాణాలకు ముప్పు ఉందని, తన పేరు బయట పెట్టవద్దని బల్తేజ్  సింగ్ కోర్టును కోరాడు. కానీ, మార్చి 2026లో న్యూజిలాండ్ మీడియా అతని పేరును అధికారికంగా బయటపెట్టింది.

 ఒక ఉన్నత కుటుంబ నేపథ్యం ఉండి కూడా, అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనే ఆశతో బల్తేజ్ సింగ్ చేసిన పనికి  న్యూజిలాండ్,  భారత్ రెండు దేశాల్లోనూ పెద్ద సంచలనంగా మారింది.

 

©️ VIL Media Pvt Ltd.