
నేటి కాలంలో చర్మ సౌందర్యానికి ఇచ్చే ప్రాధాన్యత జుట్టు సంరక్షణకు కూడా ఇస్తున్నాం. ఒత్తైన, మెరిసే జుట్టు కావాలని ఎవరికి ఉండదు? అయితే, జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం పైన పూసే షాంపూలు, క్రీములు సరిపోవు.. లోపల తీసుకునే ఆహారం కూడా అంతే ముఖ్యం అని ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్ చెబుతున్నారు. రణవీర్ సింగ్ వంటి స్టార్ల జుట్టు రహస్యం వారి ఆహారపు అలవాట్లలోనే ఉందని పేర్కొంటూ, జుట్టును కుదుళ్ల నుండి దృఢంగా మార్చే నాలుగు ముఖ్యమైన డైట్ చిట్కాలను ఆమె పంచుకున్నారు.
- చాలామంది బరువు తగ్గాలని కార్బోహైడ్రేట్లు, ముఖ్యంగా అన్నం మానేస్తుంటారు. కానీ, అన్నం తినడం వల్ల ఎవరూ లావు కారని, జుట్టు పెరుగుదలకు అన్నం చాలా అవసరమని రుజుతా స్పష్టం చేశారు. రోజుకు కనీసం ఒక్కసారైనా అన్నం తీసుకోవడం వల్ల జుట్టుకు కావాల్సిన పోషకాలు అందుతాయి.
- మన ప్రాంతంలో, ఆయా సీజన్లలో దొరికే జామ, ఉసిరి వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
- విటమిన్ సి అనేది శరీరంలో ఐరన్ గ్రహించడానికి సహాయపడుతుంది. రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిలు సరిగ్గా ఉన్నప్పుడే జుట్టు రంగు, సాంద్రత, బలం మెరుగుపడతాయి.
- ముడి పెసలు, కందిపప్పు వంటి పప్పు ధాన్యాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.
- వీటిలో ఉండే అమైనో ఆమ్లాలు, విటమిన్ బి, ఫైబర్ జుట్టు కుదుళ్లను దృఢపరిచి, జుట్టు అనవసరంగా విరిగిపోకుండా కాపాడతాయి.
- హలీమ్ వంటి విత్తనాలను డైట్‌లో చేర్చుకోవాలి. అయితే వీటిని నీళ్లలో కలిపి ‘షాట్’ లా తాగడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు, పైగా కడుపు పాడవుతుంది. వీటిని సాంప్రదాయ పద్ధతిలో ఖీర్ లేదా లడ్డూల రూపంలో తీసుకుంటేనే అందులోని ఫోలిక్ యాసిడ్ శరీరానికి అందుతుంది.
- వారానికి ఒకసారి జుట్టుకు నూనె రాసి, కనీసం 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి.
- క్రమం తప్పకుండా జుట్టును దువ్వుకుంటూ చిక్కులు లేకుండా చూసుకోవాలి.
- పార్లర్లలో చేసే ఘాటైన కెమికల్ ట్రీట్‌మెంట్లకు దూరంగా ఉండి, సహజమైన జుట్టును ప్రేమించడం నేర్చుకోవాలి.
- మన ఇంట్లో దొరికే సహజ ఆహారంతో జుట్టును సంరక్షించుకోవడం ఉత్తమం.