
చెన్నై: ప్రముఖ వస్త్రదుకాణం శరవణన్ స్టోర్స్ యజమాని లెజెండ్ శరవణన్.. నాలుగేళ్ల క్రితం తన పేరుతోనే తీసిన చిత్రం ‘లెజెండ్’. ఈ సినిమా ప్రమోషన్ల సమయంలోనే ఘోరంగా ట్రోలింగ్‌కి గురైంది. ఇక థియేటర్లలో వచ్చిన తర్వాత సినిమాపై విమర్శలు మరింత పెరిగాయి. అయితే ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత శరవణనన్ మరోసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఈ సారి ఆయన ‘లీడర్’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ మూవీకి ఆర్ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించగా.. పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటించింది. ఆండ్రియా, శ్యామ్, లాల్ లాంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. జిబ్రాన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఏప్రిల్ 3వ తేదీన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఆదివారం ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా యాక్షన్ ట్రైలర్‌ని విడుదల చేశారు. ప్రతి ఫ్రేమ్‌లోనూ ఈ ట్రైలర్‌లో భారీ తనం కనిపిస్తుంది. మరి ఈ మూవీ అయినా శరవణన్‌కి సక్సెస్ ఇస్తుందో.. లేదో చూడాలి..