
షియోమి ఇండియా అధునాతన ఫీచర్లతో రెడ్‌మి 15ఎ 5జి ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిలో 6300 ఎంఎహెచ్ సామర్థ్యంతో భారీ బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 2 రోజుల వరకు పనిచేస్తుంది. దీని 6.9 అంగుళాల స్క్రీన్, 120 హెరట్జ్ వేగం వినియోగదారులకు మంచి అనుభూతిని ఇస్తాయి. దీని ప్రారంభ ధర రూ.12,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ నాలుగేళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లతో లభిస్తుంది. ఏప్రిల్ 3 నుండి ఆన్‌లైన్, ఇతర స్టోర్లలో ఇది అందుబాటులో ఉంటుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.