Reading Time: < 1 minute

కోరుట్ల లో వీర హనుమాన్ విజయయాత్ర

Caption of Image.

కోరుట్ల,వెలుగు: జగిత్యాల జిల్లా  కోరుట్ల లో శనివారం వీహెచ్​పీ, భజరంగ్​దళ్  ఆధ్వర్యంలో వీర హనుమాన్​ విజయయాత్ర ఘనంగా నిర్వహించారు.   శ్రీరాముడు, హనుమాన్​, భరతమాత​ విగ్రహాలను ప్రత్యేక వాహనంపై ప్రతిష్ఠించి​ ప్రత్యేక పూజలు చేసి అనంతరం వీర హానుమాన్​ విజయ యాత్రను ప్రారంభించారు. 

శ్రీ వేంకటేశ్వరాలయం నుంచి గాంధీరోడ్డు  మీదుగా కార్గిల్​ చౌరస్తా , కొత్తబస్టాండ్​ మీదుగా అంబేద్కర్ నగర్​, కాల్వగడ్డ మీదుగా వేంకటేశ్వరాలయం వరకు యాత్ర   కొనసాగింది.  యాత్రలో దండి పీఠాధిపతి స్వామిజీ , బీజేపీ రాష్ర్ట కార్యవర్గ సభ్యులు సురభి నవీన్ పాల్గొన్నారు. ​  

©️ VIL Media Pvt Ltd.