Reading Time: < 1 minute

ది ప్యారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

Caption of Image.

నాని  హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. పీరియాడిక్ యాక్షన్‌‌‌‌‌‌‌‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్  శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో వేసిన స్పెషల్ సెట్‌‌‌‌‌‌‌‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌‌‌‌‌‌‌‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ ఒక్క ఫైట్ ఎపిసోడ్ కోసమే దాదాపు  రూ.5 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. భారీ సెట్ వేసి, వందలమంది ఫైటర్స్‌‌‌‌‌‌‌‌తో  ఈ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారట. ఈ సీన్ సినిమాకే హైలైట్‌‌‌‌‌‌‌‌గా నిలుస్తుందని తెలుస్తోంది. 

ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తికాగా, జూన్‌‌‌‌‌‌‌‌ నెలాఖరు  కల్లా మొత్తం షూట్‌‌‌‌‌‌‌‌ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మోహన్ బాబు, రాఘవ్ జుయల్,  సంపూర్ణేష్ బాబు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్​ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ఆగస్టు 21న ఎనిమిది భాషల్లో  పాన్-వరల్డ్ విడుదలకు సిద్ధమవుతోంది. 

ఇప్పటికే విడుదలైన ‘ఆయా షేర్ ’ సాంగ్‌‌‌‌‌‌‌‌తోపాటు  ప్రమోషనల్ కంటెంట్‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న చిత్రం కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి.

©️ VIL Media Pvt Ltd.