Reading Time: < 1 minute

ఎందుకింత పనిచేశావమ్మా.. పదమూడేళ్లకే గడ్డి మందు తాగి చచ్చిపోవాల్సినంత కష్టం ఏం వచ్చిందో పాపం..!

Caption of Image.

మంచిర్యాల: చెన్నూరులోని సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న రాళ్లబండి శ్రీవింధ్య(13) గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గంగారం గ్రామానికి చెందిన రాళ్లబండి రమేష్, చంద్ర కళ దంపతుల కుమార్తె నాలుగో తరగతి నుంచి ఇదే స్కూల్లో చదువుతోంది. ఆమె చెల్లెలు శ్రీజ కూడా అక్కడే ఆరో తరగతి చదువుతోంది. గత బుధవారం సాయంత్రం శ్రీ వింధ్య వాంతులు చేసుకోవడంతో స్కూల్ సిబ్బంది చెన్నూరు గవర్నమెం ట్ హాస్పిటల్లో చేర్పించారు.

మరుసటి రోజు బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించగా వారు రాగానే సిబ్బంది వెళ్లిపోయారు. కండిషన్ సీరియస్గా ఉండటంతో నిన్నమంచిర్యాలలోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆమె పాయిజన్ తీసుకున్నట్టు అనుమానించి విద్యార్థిని అడగ్గా విషయం చెప్పింది. ఇవాళ ఉదయం 6 గంటలకు ప్రాణాలు కోల్పోయింది. స్కూల్ సిబ్బంది వేధింపుల వల్లే బాలిక సూసైడ్ చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపించారు.

►ALSO READ | మంచిర్యాల జిల్లాలో విషాదం: లారీ కింద పడి ఎనిమిది నెలల పాప మృతి…

©️ VIL Media Pvt Ltd.