
ఐపిఎల్ 2026లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ భారీ షాట్లతో మెరుపులు మెరిపిస్తున్నాడు. ఈ మెగా టోర్నమెంట్ లో భాగంగా జరుగుతున్న రెండో లీగ్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్(కెకెఆర్) నిర్దేశించిన 221 లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి అదిరిపోయే ఆరంభం లభించింది. రోహిత్ కేవలం 23 బంతుల్లో 5 సిక్సులు, మూడు ఫోర్లతో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో రికల్టన్ కూడా భారీ షాట్లతో కోల్ కతా బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. దీంతో ముంబై జట్టు పవర్ ప్లే ముగిసే సరికి 80 పరుగులు చేసింది. ముంబై విజయానికి 14 ఓవర్లలో 141 పరుగులు చేయాల్సి ఉంది.
అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టి కోల్ కతా బ్యాటర్స్ అదరగొట్టారు. ఓపెనర్లు అజింక్యా రహానె(67), ఫిన్ అలెన్(37)లు శుభారంభాన్ని అందించారు. తర్వాత రఘువంశీ(51) అర్ధ శతకంతో మెరుపులు మెరిపించాడు. చివర్లలో రింకూ సింగ్(33 నాటౌట్)కూడా ధనాధన్ బ్యాటింగ్ తో అలరించాడు. దీంతో కోల్ కతా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది.