
పల్నాడు: పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టించింది. స్థానిక లాడ్జ్‌లో మూడేళ్ల కూతురితో కలిసి భార్యభర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు తల్లి శంకరకుమారి (30), చిన్నారి మౌనిక (3) మృతి చెందగా.. భర్త గోపి పరిస్థితి విషమంగా ఉంది. నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దంపతుల స్వస్థతలం నాదెండ్ల మండలం సాతులూరుగా పోలీసులు గుర్తించారు. గోపి భోపాల్ ఎయిమ్స్‌లో పని చేస్తుండగా.. శంకర కుమారి కూడా అదే ఆస్పత్రిలో నర్సుగా పనిని చేస్స్తున్నారు. శనివారం రాత్రి భోపాల్ నుంచి నరసరావుపేటకు వచ్చిన కుటుంబం ఈ దారణానికి పాల్పడింది. ఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మత్తు ఇంజక్షన్ చేసుకొని ఉండొచ్చని భావిస్తున్నారు.