
భద్రాద్రికొత్తగూడెం జిల్లా చింతూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బొడ్డుగూడెం శివారులో ఎదురుగా వస్తున్న వాహనం తప్పించబోయి తుఫాన్ పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా పది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. తుఫాన్ వాహనం 12 మంది ప్రయాణికులతో భద్రాచలం నుంచి చింతూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.