
టాలీవుడ్ ఇండస్ట్రీలో సహాయ నటుడిగా, విలన్ పాత్రలతో ఫేమస్ అయ్యారు అశోక్ కుమార్. ఆ తర్వాత నిర్మాతగా మారి పలు చిత్రాలను తెరకెక్కించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, జీవిత సత్యాల గురించి అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అశోక్ కుమార్ నిర్మాతగా తన ప్రయాణాన్ని వివరిస్తూ, విక్టరీ వెంకటేష్ తొలి చిత్రం ‘కలియుగ పాండవులు’ సమయానికే ఆయనకు అడ్వాన్స్ ఇచ్చిన మొదటి నిర్మాత తానేనని గుర్తుచేసుకున్నారు. రామానాయుడు వెంకటేష్ ను కలిసి, సెంటిమెంట్‌గా ఒక శుక్రవారం రోజున అడ్వాన్స్ అందజేశానని గుర్తు చేసుకున్నారు. అయితే, ఆ తర్వాత వెంకటేష్ వరుసగా పెద్ద బ్యానర్లలో సినిమాలు చేయడంతో, అశోక్ కుమార్ నిర్మాణంలో వచ్చిన ‘రక్త తిలకం’ వెంకటేష్ కెరీర్‌లో ఎనిమిదవ సినిమాగా నిలిచింది.
ఎక్కువమంది చదివినవి : Cinema : హీరో ముసలోడు అని కొనేవాడు రాలేదు.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
‘రక్త తిలకం’ సినిమా విడుదల సమయంలో చిరంజీవి, బాలకృష్ణ, శోభన్ బాబు వంటి అగ్ర హీరోల సినిమాలు పోటీలో ఉన్నాయి. అప్పటికే వెంకటేష్ కి కొన్ని వరుస పరాజయాలు ఉండటంతో సురేష్ బాబు కొంత ఆందోళన చెందినప్పటికీ, అశోక్ కుమార్ సినిమాపై నమ్మకంతో పట్టుబట్టి విడుదల చేశారట. చివరకు ‘రక్త తిలకం’ ఘనవిజయం సాధించి, వెంకటేష్ కెరీర్‌ను మళ్ళీ గాడిలో పెట్టింది. కేవలం సినిమా విశేషాలే కాకుండా, లోతైన ఆధ్యాత్మిక , తాత్విక విషయాలను చర్చించారు. ‘రక్త తిలకం’ వంటి పేర్లు పెట్టినప్పుడు ఎదురయ్యే నెగిటివ్ ఎనర్జీ గురించి, ఆ సమయంలో జరిగిన కొన్ని ప్రమాదాల గురించి ఆయన ప్రస్తావించారు. ప్రతి అక్షరానికి ఒక శక్తి ఉంటుందని అన్నారు. రక్త తిలకం సినిమా సమయంలో ముగ్గురు చనిపోయారని.. కానీ అది సినిమాకు సంబంధం లేదని అన్నారు. కొన్ని పేర్లకు నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని అన్నారు.
ఎక్కువమంది చదివినవి : Tanikella Bharani: అలాంటి హీరోను నా జీవితంలో చూడలేదు.. ఆయన వల్లే నా జీవితం మారిపోయింది.. తనికెళ్ల భరణి..
జీవితంలో విజయం సాధించడానికి రెండు మార్గాలు ఉంటాయని ఆయన వివరించారు. ఒకటి, మనలోని ప్రతిభను మెరుగుపరుచుకుంటూ పాజిటివ్‌గా ఎదగడం; రెండోది, ఇతరులను కించపరుస్తూ లేదా తొక్కేస్తూ పైకి రావాలనుకోవడం. నెగిటివ్ మార్గంలో వెళ్తే మన పుణ్యఫలం , శక్తి క్షీణిస్తుందని, అదే పాజిటివ్ మార్గంలో వెళ్తే విశ్వశక్తి మనకు తోడవుతుందని ఆయన అన్నారు.
ఎక్కువమంది చదివినవి : Baahubali 2 : బాహుబలి 2లో నేను చేసిన సీన్స్ అన్నీ తీసేసారు.. అయినా ఫేమస్ అయ్యా.. టాలీవుడ్ నటుడు..
ఎక్కువమంది చదివినవి : Tollywood : మొన్నటిదాక తోపు సింగర్.. ఇప్పుడు స్పెషల్ పాటతో గ్లామర్ బీభత్సం.. ఎవరో గుర్తుపట్టారా.. ?