
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19 సీజన్ తొలి మ్యాచ్‌యే వివాదంతో ప్రారంభమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ఓ రెండు క్యాచ్‌లు మ్యాచ్‌ని ఊహించని మలుపు తిప్పాయి. ఆ రెండు క్యాచుల్లో ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ కీలక పాత్ర పోషించడం గమనార్హం. ఈ మ్యాచ్ తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ ఆరంభంలో వికెట్లు కోల్పోయినా.. ఆ తర్వాత పుంజుకుంది. కెప్టెన్ ఇషాన్ కిషన్, క్లాసెన్‌లు కలిపి ఇన్నింగ్స్‌ను నిర్మించారు. అయితే ఈ మ్యాచ్‌లో ఓ క్యాచ్ వివాదానికి కారణమైంది. రొమారియో షెపర్డ్ వేసిన 14వ ఓవర్ తొలి బంతిని క్లాసన్ భారీ షాట్ ఆడాడు. కానీ, బౌండరీ వద్ద ఫిలిప్ సాల్ట్ అందుకున్నాడు. అయితే వికెట్‌ను థర్డ్ అంపైర్ సమీక్ష కోరారు. సాల్ట్ బౌండరీ కుషన్ తాకినట్లు అనిపించింది.. కానీ, థర్డ్ అంపైర్ మాత్రం దాన్ని ఔట్‌గా ప్రకటించారెు. దీనిపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి.
ఇక సన్‌రైజర్స్ 202 పరుగుల టార్గెట్‌ను కాపాడు కోవడంలో విఫలమైంది. క్లాసెన్ ఔట్ కాకపోయి ఉందే 240+ స్కోర్ సాధించేదని ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ, ఆ కోరిక తీరలేదు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో క్లాసెస్ చేసిన పొరపాటుకు మొత్తం జట్టు భారీ మూల్యం చెల్లించుకుంది. ఛేజ్ మాస్టర్ కోహ్లీ.. 28 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద భారీ షాట్‌కు ప్రయత్నించాడు. లాంగ్ఆన్‌లో ఉన్న క్లాసెన్ బంతిని అందుకున్నట్లే కనిపించింది. దీంతో స్టేడియం మొత్తం సైలెంట్ అయిపోయింది. కానీ, క్లాసెన్ ఆ క్యాచ్‌ని చేజార్చాడు. దీంతో స్టేడియం అంతా గోలలు, ఈలలతో మారు మోగిపోయింది. ఆ తర్వాత విరాట్ (68) అద్భుతంగా రాణించి జట్టుకు విజయాన్ని అందించాడు.