Reading Time: < 1 minute
Nitish Kumar Bihar Cm Resigns Mlc March 30 Rajya Sabha

CM Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి మార్పు ఉత్కంఠ నేపథ్యంలో రేపు సీఎం నితీష్ కుమార్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయబోతున్నారు. మార్చి 16న ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. మార్చి 30 సోమవారం రోజున ఆయన శాసన మండలి సభ్యుడిగా రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం, పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన 14 రోజుల్లోపు రాష్ట్ర శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని చెబుతోంది.

Read Also: Fire Accident : మణికొండలో అగ్నిప్రమాదం.. అల్కాపూర్‌ టౌన్‌షిప్‌లో చెలరేగిన మంటలు

అయితే, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినప్పటికీ, వెంటనే బీహార్ సీఎం పదవికి రాజీనామా చేయకపోవచ్చని తెలుస్తోంది. ఏ సభలోనూ సభ్యుడు కాకపోయినా, ఒక వ్యక్తి 6 నెలల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగవచ్చు. కాబట్టి నితీష్ వెంటనే సీఎం పీఠం దిగకపోవచ్చని ఆయన సన్నిహిత వర్గాలు భావిస్తున్నాయి.