
హైదరాబాద్: మతిస్థిమితంలేని యువతిపై అత్యాచారం చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్ ప్రాంతంలో జరిగింది. హాసన్‌నగర్‌లో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఓ మతిస్థిమితం లేని యువతిపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో సభ్యులు గుర్తించి వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని ఆరోగ్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.