
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని ఓ పెట్రోల్ బంక్‌లో ఈ అరాచకమైన దృశ్యం కనిపించింది. అక్కడ బహిరంగంగానే ఓ సింటెక్స్ ట్యాంక్, కొన్ని డ్రమ్ముల్లో భారీగా డీజిల్ నిల్వ చేశారు. బంక్‌లోనే ఓగోడ పక్కన ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా స్టోర్ చేశారు. అక్రమ పద్ధతుల్లో ఇలా నిల్వ చేయడం ప్రమాదమని తెలిసీ ఇలా చేశారంటే వీళ్లను ఏమనాలని ప్రజలు నిలదీస్తున్నారు. అయితే.. డీజిల్‌ని దొడ్డిదారిన అమ్ముకునేందుకు సైడ్ చేశారనే అనుకున్నా.. కనీసం దానికి మూత అయినా బిగించాలి.. కానీ అది కూడా చేయలేదు. కేవలం ఓ గుడ్డ కప్పారు. దానిపై ఓ పాత ఫ్లెక్సీ ఉంటే దాన్ని వేసి అలాగే వదిలేశారు. అసలే ఎండాకాలం ఏమాత్రం తేడా వచ్చినా భగ్గుమని మంటలు రావడం ఖాయమని పేర్కొంటున్నారు. ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో డీజిల్‌ని నిల్వ చేసిన విషయం తెలిసి సివిల్ సప్లయిస్ అధికారులు దాడులు చేశారు. నాగసాల బంకులో 2 వేల 700 లీటర్ల డీజిల్ సీజ్ చేశారు. ట్యాంకులు, డ్రమ్ముల్లో నిల్వపై అదనపు కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు.
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ నాగసాల సమీపంలోని ప్రకాష్ ఫిల్లింగ్ స్టేషన్‌లో ఘటనను సీరియస్‌గానే తీసుకున్నారు అధికారులు. డ్రమ్ముల్లో డీజిల్ నిల్వ చేసి బట్టతో కప్పడం చాలా డేంజర్ అంటున్నారు. సమీపంలోనే ఇటుక బట్టీలు ఉన్నాయి. అట్నుంచి ఏమాత్రం నిప్పురవ్వలు వచ్చిపడ్డా ప్రమాదమే. అలాగే.. దగ్గర్లోనే గురు పాఠశాల కూడా ఉంది. అక్కడా వేల మంది చదువుతున్నారు. ఇలాంటి చోట ఇంత నిర్లక్ష్యంగా డీజిల్ స్టోర్ చేయడంపై మండిపడ్డారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..