Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: ఎండాకాలం లో నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర నీటిపారుదల, పౌ ర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శాసనసభలో ఆయన ప్రకటించారు. 2028 జూన్ మాసాంతానికి ఎస్.ఎల్. బి.సి పాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశా రు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం ముందుకు పో తుందని ఆయన తెలిపారు. ఆదివారం శాసనసభలో నీటిపారుదల శాఖపై కాంగ్రెస్‌కు చెంది న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎంఐఎం సభ్యు లు బల్లాల తదితరులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం

ఇస్తూ ఎస్‌ఎల్‌బిసి తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమని ఇది పూర్తి అయితే ఉమ్మడి నల్లగొండ జి ల్లాలో సమృద్ధిగా సాగునీటి సరఫరాతో పాటు ఫ్లోరోసిస్ రహిత సురక్షిత మైన త్రాగు నీటిని అందించవచ్చని ఆయన వివరించారు. అయితే 2025, ఫిబ్రవరిలో దురదృష్టవశాత్తు జరిగిన ఘటనలో కార్మికులు దుర్మరణం పాలు కావ డం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సంఘటన అనంతరం ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు గాను అత్యధునాతన సాంకేతిక పద్ధతులతో అంతర్జాతీయ ప్రమా ణాల కనుగుణంగా పునరుద్ధరణ పనులు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. అయితే అదే సమయంలో కార్మికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అంతకు ముందు జరిగిన ఘటన పునరావృతం కాకుండా శాస్త్రీయ పద్దతిలో పర్యవేక్షణతో పాటు భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు పరుస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

గడిచిన బిఆర్‌ఎస్ పాలనలో నీటిపారుదల రంగం మీద 1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా ఫలితం సాధించ లేకపోయారని ఆయన విమర్శించారు. అందులో పెద్దఎత్తున నిధులు వెచ్చించి కాలేస్వరం ప్రాజెక్టును నిర్మించినా అది కూలిపోయిన విషయం సభకు విదితమేనన్నారు. వారి పాలన లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకంపై పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసినా కొత్తగా ఎకరాకు సాగు నీరు అందించలేక పోయారని ఆయన ఎద్దేవా చేశారు. నాటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రత్యేకించి కొత్తగా రెండు కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసి అధిక వడ్డీతో 97,000 వేల కోట్లు స్వల్పకాలిక ఋణాలు తీసుకున్నారని ఆయన చెప్పారు. దీని వల్ల ప్రస్తుత ప్రభుత్వం మీద 54 వేల కోట్ల మూల ధనం,27 వేల కోట్ల వడ్డీతో కలుపుకొని 82,000 వేల కోట్ల భారం పడిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 41,000 కోట్ల మూలధనంతో పాటు 16,000 వేల కోట్ల వడ్డీ మొత్తాలను చెల్లించి నట్లు ఆయన సభకు వివరించారు.

అంతే గాకుండా బిఆర్‌ఎస్ పాలనలో చేసిన స్వల్ప కాలిక రుణాలను దీర్ఘకాలిక ఋణలుగా మార్చి ప్రాజెక్టుల నిర్మాణాలకు నిధులు విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం జరగడానికి గత ప్రభుత్వం చేసిన నిర్వాకంతోటే అని తెలంగాణ ప్రజలు ఈ గణాంకాలను గుర్తించాలని ఆయన కోరారు. కృష్ణా బేసిన్ మీద ఉన్న ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. పెండింగ్ లో ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని అందుకు అవసరమైన భూసేకరణకోసం ప్రభుత్వం 5,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజిని మంజూరు చేసిందని ఆయన సభకు వివరించారు. జూన్,2026 నాటికి ఈ నిధులను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. గడిచిన ప్రభుత్వం డిండి ఎత్తిపోతల పధకంపై 5000 కోట్లు ఖర్చు చేసి కుడా ప్రయోజనం లేకుండా పోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 18,000 కొట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను ప్రారంభించిందని ఆయన తెలిపారు.