Reading Time: < 1 minute

ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో చెలరేగిన మంటలు

Caption of Image.

వరంగల్  ఆర్టీసీ డిపోలో ప్రమాదం జరిగింది.  మార్చి 28న ఉదయం తెల్లవారుజామున ఎలక్ట్రిక్ బస్సులో ఒక్కసారిగా  మంటలు చెలరేగాయి.  అధికారులు అప్రమత్తం కావటంతో  ప్రమాదం తప్పింది. అక్కడున్న వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు. బస్సు  వెనుకు భాగం  కాలిపోయింది.విద్యుత్ షాక్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం జరిగినట్టు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. బస్సులోని నాలుగు బ్యాటరీలు దగ్ధమైనట్లు తెలిపారు. 

©️ VIL Media Pvt Ltd.