
IPL (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2026లో రెండవ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు, మూడుసార్లు విజేతగా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో తలపడనుంది. ఇవాళ సాయంత్రం (మార్చి 29, ఆదివారం) ముంబైలోని వాంఖేడే స్టేడియం వేదికగా ఇరు జట్లు హోరాహోరీగా పోటీపడనున్నాయి.
టోర్నమెంట్‌ను విజయంతో ప్రారంభించాలనే ఇరు జట్లు భావిస్తున్నాయి. ఐపిఎల్ లో అత్యుత్తమ జట్లలో ఒకటి ముంబై ఇండియన్స్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు జట్టులో ఉండటంతో ఈసారి టైటిల్ గెలుపే లక్ష్యంతో ముంబై ఇండియన్స్ (MI) బరిలోకి దిగనుంది. మరోవైపు, అంగక్రిష్ రఘువంశీ, అజింక్య రహానే, కామెరాన్ గ్రీన్ వంటి ఆటగాళ్లతో KKR కూడా ఎంతో పటిష్టంగా కనిపిస్తోంది. MIకి గట్టి పోటీని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.
వాంఖేడే పిచ్ ఎలా ఉంటుందంటే..
ముంబైలోని వాంఖేడే స్టేడియం పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ పిచ్‌పై మొదట బౌలింగ్ ఎంచుకుని, తర్వాత లక్ష్యాన్ని ఛేదించడం సులభంగా ఉంటుంది.
జట్ల వివరాలు:
ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ర్యాన్ రికిల్టన్, రాబిన్ మింజ్, రాజ్ బావా, రఘు శర్మ, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బాష్, నమన్ ధీర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, అల్లా గఫాంజర్, అశ్వనీ కుమార్, దీపక్ షెదర్ విల్, దీపక్ చహర్, విల్, దీపక్ చహర్, మే మార్కండే, శార్దూల్ ఠాకూర్, క్వింటన్ డి కాక్, డానిష్ మలేవార్, మహ్మద్ ఇజార్, అథర్వ అంకోలేకర్, మయాంక్ రావత్
కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే, అంగ్క్రిష్ రఘువంశీ, అనుకూల్ రాయ్, హర్షిత్ రాణా, మనీష్ పాండే, రమణదీప్ సింగ్, రింకు సింగ్, రోవ్‌మన్ పావెల్, సునీల్ నరైన్, ఉమ్రాన్ మాలిక్, వైభవ్ అరోరా, వరుణ్ చకరవర్తి, కామెరూన్, గ్రీన్, ఫిన్ పతీర్ అల్లెన్, టీజా అలెన్ త్యాగి, ప్రశాంత్ సోలంకి, రాహుల్ త్రిపాఠి, టిమ్ సీఫెర్ట్, సార్థక్ రంజన్, దక్ష్ కమ్రా, రచిన్ రవీంద్ర, ఆకాష్ దీప్, బ్లెస్సింగ్ ముజారబానీ.