Reading Time: < 1 minute
Monkey Prays In Hanuman Temple Komaram Bheem Asifabad Viral Incident

Komaram Bheem District: హనుమంతుడి ఆలయంలో అద్భుతం జరిగింది. ఓ వానరం నేరుగా అంజన్న గుడిలోకి వచ్చి పూజలు చేసింది. ఈ ఘటన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. దహెగాం మండలం కేంద్రంలోని ఓ రామాలయంలో హనుమాన్ విగ్రహానికి స్వాముల పూజలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఓ మర్కటం ప్రవేశించింది. హనమయ్యకు మంగళ హారతి ఇచ్చేంత వరకు అక్కడే శ్రద్ధగా కూర్చొని పూజలను వీక్షించింది. హారతి అనంతరం.. వాయుపుత్రుడి విగ్రహం వద్దకు వెళ్లి మొక్కింది. అంతటితో ఆగలేదు. స్వామివారికి సమర్పించి తీర్థాన్ని తనివితీరా తాగి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ తతంగాన్ని హనుమాన్ దీక్ష దారులు అక్కడే ఉండి వీక్షించారు. ఆ బజరంగబలే వానర రూపంలో వచ్చి తమకు దర్శన మిచ్చారని మాలాధారులు సంతోషం వ్యక్తం చేశారు. హనుమంతుడు వాయుదేవుడు, అంజనాదేవిల కుమారుడు. శివుని అంశతో జన్మించిన వానర దేవుడు. రామాయణంలో రాముడికి అత్యంత భక్తుడిగా, రాక్షస సంహారంలో కీలక పాత్ర పోషించిన హనుమంతుడు, శారీరక బలం, తెలివితేటలు, భక్తికి ప్రతీకగా నిలుస్తాడు. నమ్మినవారికి నేనున్నానంటూ వరాలు ఇచ్చే దేవుడు అభయాంజనేయుడు. శ్రీరాముడిని నమ్మిన భక్త ఆంజనేయుడు. సిందూర ప్రియుడు. ఒక్కసారి మాలధరించి ‘అంజన్నా.. అని పిలిస్తే’ పలుకుతాడనే నమ్మకం.

READ MORE: Kavitha: సీఎం రేవంత్‌రెడ్డికి కవిత లేఖ.. నాడు కేసీఆర్‌కు రాసిన లేఖను గుర్తు చేసిన జాగృతి అధినేత్రి!