Reading Time: < 1 minute

రాష్ట్ర గవర్నర్‌గా ఇటీవల నియమితులైన శివ ప్రతాప్ శుక్లాతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సమావేశమయ్యారు. గవర్నర్ శుక్లాకు బండి సంజయ్ పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా వీరిరువురూ అరగంట పాటు రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. అయితే గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా నియమితులైన తర్వాత కలిసి అభినందించలేదు కాబట్టి శనివారం లోక్ భవన్ (రాజ్ భవన్)కు వచ్చినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ పిఆర్‌వో మధు తెలిపారు.