
ఇళ్లు, భూములు లాక్కుంటే చూస్తూ కూర్చోవాలా అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు నష్టం జరిగితే ఆరు నూరైనా అడ్డుకొని తీరుతామని ఆమె పేర్కొన్నారు. మమ్మల్ని సామాజిక బహిష్కరణ చేస్తారని సిఎం అంటున్నారని ఆయన మాటలకు భయపడేది లేదని ఆమె అన్నారు. రెండేళ్లు ఆగితే ప్రజలే కాంగ్రెస్ బహిష్కరిస్తారని ఆమె విమర్శించారు. మూసీ ప్రక్షాళన పేరుతో 10 వేల ఇళ్లను కూల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. మూడు వేల ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేస్తుందని ఆమె విమర్శించారు. తాము మూసీకి వ్యతిరేకం కాదని, ప్రభుత్వ దోపిడీకి వ్యతిరేకమని ఆమె అన్నారు. ఇళ్లు, భూములు లాక్కుంటే చూస్తూ కూర్చోవాలా కోర్టులకే కాదు ఎంత దూరమైనా వెళ్తామని ఆమె తెలిపారు.