Reading Time: < 1 minute

డ్రైవర్ల కంటిచూపే ప్రయాణికులకు భద్రత : కరీంనగర్ సీపీ గౌష్ ఆలం

Caption of Image.
  •     కరీంనగర్ సీపీ గౌష్ ఆలం

గంగాధర, వెలుగు:  డ్రైవర్ల కంటి చూపే ప్రయాణికులకు భద్రత అని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం అన్నారు. అరైవ్​ అలైవ్​ రెండో దశ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా గంగాధర మండలం మధురానగర్​లోని ఓ ఫంక్షన్​ హాల్​లో లయన్స్ క్లబ్ సహకారంతో శనివారం ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల కంటిచూపు అత్యంత కీలకమని, డ్రైవర్లు తమ కంటిచూపుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ద్వారా ప్రాణాలతో పాటు ప్రయాణికుల భద్రతను కూడా కాపాడవచ్చని సూచించారు. 

రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడమే ఈ శిబిరం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ శిబిరంలో ఆటో, లారీ, కార్ వంటి వాహనాల డ్రైవర్లు అధిక సంఖ్యలో హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయకుమార్, చొప్పదండి సీఐ ప్రదీప్​కుమార్, ఎంవీఐలు రవికుమార్, రజిని, ఎంపీడీవో దమ్మని రాము, తహశీల్దార్ రజిత, గంగాధర, రామడుగు, చొప్పదండి ఎస్సైలు వంశీకృష్ణ, రాజు, నరేశ్​రెడ్డి, మండలంలోని సర్పంచులు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.  

©️ VIL Media Pvt Ltd.