Reading Time: 2 minutes

Virat Kohli: సింపుల్ క్యాచ్ మిస్ చేసిన కోహ్లీ.. అనుష్క శర్మ రియాక్షన్ వైరల్

Caption of Image.

Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ తొలి మ్యాచ్‌లోనే ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ RCB వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన పోరులో తొలుత బ్యాటింగ్‌కు దిగిన SRHకు ఆర్సీబీ పేసర్ జాకబ్ డఫీ చుక్కలు చూపించాడు. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 22 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. అయితే, ఒకవైపు వికెట్లు పడుతున్నా ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ ఇషాన్ కిషన్ (53 బంతుల్లో 80 పరుగులు) అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. అతనికి తోడుగా హెన్రిచ్ క్లాసెన్ (31), అనికేత్ వర్మ మెరుపులు మెరిపించడంతో SRH నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. కాగాఈ మ్యాచ్ లో ఫీల్డింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీ చేసిన పొరపాటు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చనీయాంశంగా మారింది.

కోహ్లీ క్యాచ్ డ్రాప్: 
మ్యాచ్ క్లైమాక్స్ దశలో భువనేశ్వర్ కుమార్ వేసిన ఓవర్‌లో SRH బ్యాటర్ అనికేత్ వర్మ (26 పరుగుల వద్ద) లాంగ్ ఆన్ వైపు భారీ షాట్‌కు ప్రయత్నించాడు. బంతి గాలిలోకి చాలా ఎత్తుకు లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ వేగంగా అక్కడికి వచ్చి ఆ క్యాచ్‌ను అందుకోవడానికి సిద్ధమయ్యాడు. కానీ, అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ అత్యంత సులువైన ఆ క్యాచ్‌ను కింగ్ కోహ్లీ వదిలి పెట్టేశాడు. ఈ క్యాచ్ డ్రాప్ తో చిన్నస్వామి స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఫీల్డింగ్‌లో ఎంతో కచ్చితంగా ఉండే కోహ్లీ ఇలాంటి తప్పు చేయడం చూసి జట్టు సభ్యులు, అభిమానులు షాక్‌కు గురయ్యారు.

అనుష్క శర్మ రియాక్షన్: 
కింగ్ విరాట్ కోహ్లీ క్యాచ్ వదిలేసిన సమయంలో స్టాండ్స్‌లో ఉన్న అతని భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆర్సీబీ కొత్త ఓనర్ ఆర్యమన్ బిర్లా సోదరి అనన్యా బిర్లాతో కలిసి మ్యాచ్ చూస్తున్న అనుష్క, కోహ్లీ క్యాచ్ డ్రాప్ చేయగానే నోరు వెళ్లబెట్టి అవాక్కయ్యారు. ఆమె రియాక్షన్ విజువల్స్ కెమెరా కంటికి చిక్కడంతో ఈ వీడియో కాస్త నెట్టింట హల్చల్ చేస్తోంది.

 

©️ VIL Media Pvt Ltd.