Reading Time: < 1 minute

హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డికి బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. తన తమ్ముడు, బావమరిదిపై సిఎం ఆరోపణలు చేశారని.. సిఎం తమ్ముడు, బావమరిదిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని హరీశ్ అన్నారు. తన తమ్ముడు, బావమరిదిపై విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని.. సిఎం తమ్ముడు, బావమరిదిపై విచారణకు రేవంత్ సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. హౌసింగ్ కమిటీ కాదు.. సిబిసిఐడి కాదు.. సిట్టింగ్ జడ్జితో విచారణకు తాను సిద్ధమని.. సిఎం సిద్ధంగా ఉన్నారా.. అని అడిగారు.

‘‘మంత్రి పొంగులేటిని కాపాడేందుకు వంద అబద్ధాలు ఆడి రేవంత్ దొరికిపోయారు. ఏ పని కోసం నేనెప్పుడు పొంగులేటికి ఫోన్ చేయలేదు. పొంగులేటి కంపెనీ అవినీతి పాల్పడిందని అందరికీ అర్థమైంది. తప్పు జరిగిందని సిఎం, మంత్రి అసెంబ్లీలోనే ఒప్పుకున్నారు. సిఎం, పొంగులేటి మధ్య లావాదేవీలు ఉంటాయి. వాళ్లు భూములను చెరిసగం పంచుకుంటారు. సభా సంఘం వేస్తే అన్నీ బయటకు వస్తాయని భయపడుతున్నారు. కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో చేర్చి బేరం కుదిరితే తొలగిస్తున్నారు’’ అని హరీశ్ రావు ఆరోపించారు.