
హైదరాబాద్: ఫార్ములా ఈ- రేసు కేసు సిఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని కేంద్రమంత్రి బండిసంజయ్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఒక్కటే అని అన్నారు. ఈ సందర్భంగా బండిసంజయ్ మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరు సరైనది కాదు అని.. ఎథిక్స్ కమిటీ లేదని..అసెంబ్లీ కమిటీ లేవు అని విమర్శించారు. లేని కమిటీకి కౌశిక్ రెడ్డి అంశం రికమాండ్ చేయడం ఏంటీ? అని బండి సంజయ్ ప్రశ్నించారు. మాజీ మంత్రి హరీశ్ రావుతో జాగ్రత్తగా ఉండు అని కెటిఆర్ కు రేవంత్ సూచన చేశారు అని.. కెటిఆర్, రేవంత్ మధ్య డీల్ కుదిరింది అని అన్నారు. కాళేశ్వరం అంశంలో తమపై తుపాకీ పెట్టి రేవంత్ కాలుస్తాం అంటే ఊరుకోం అని హెచ్చరించారు. బిఆర్ఎస్- బిజెపి పొత్తు ఎప్పటికీ జరగదు అని..వారసత్వ, కుటుంబ రాజకీయాలకు బిజెపి వ్యతిరేకం అని తెలియజేశారు. సిఎం డిప్రెషన్ లో ఉండి డీలిమేషన్ పై మాట్లాడుతున్నారు అని ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ లకు బిజెపి దూరం అని బండి సంజయ్ పేర్కొన్నారు.