Reading Time: 2 minutes
Tollywood : నాకు మగాళ్ల తోడు అక్కర్లేదు.. ఎవరితో ఉండాలనేది నా ఇష్టం.. 50 ఏళ్ల హీరోయిన్ సంచలన కామెంట్స్..

బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకుంది మలైకా అరోరా. ఒకప్పుడు సినీరంగంలో అత్యధిక డిమాండ్ ఉన్న గ్లామరస్ బ్యూటీ. సినిమాల్లో స్పెషల్ పాటలతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యింది. తెలుగు, హిందీ భాషలలో పలు ప్రత్యేక పాటలకు ఎనర్జీటిక్ డ్యాన్స్, గ్లామరస్ లుక్స్ తో కట్టిపడేసింది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు.. ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇటీవల రష్మిక మందన్న నటించిన థామా చిత్రంలో స్పెషల్ సాంగ్ తో ఊర్రూతలూగించింది. ప్రస్తుతం ఆమె వయసు 50 సంవత్సరాలు. ఇప్పటికీ పాతికేళ్ల అమ్మాయిల ఫిట్నెస్ లుక్స్ తో కట్టిపడేస్తుంది. మరోవైపు తన వ్యక్తిగత విషయాలతోనే నిత్యం వార్తలలో నిలుస్తుంది. ఇదివరకే భర్తతో విడాకులు తీసుకున్న మలైకా.. కొన్నాళ్లపాటు బీటౌన్ హీరో అర్జున్ కపూర్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే వీరిద్దరు విడిపోయారు. ఈ క్రమంలోనే వజ్రల వ్యాపారితో మలైకా డేటింగ్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుంది. తాజాగా ఈ రూమర్స్ పై స్పందించింది మలైకా.

ఎక్కువ మంది చదివినవి : Anushka Shetty : ఆ హీరో నాకు చాలా స్పెషల్.. అతడే నాకు గాడ్ ఫాదర్.. నా జీవితాన్ని మార్చేశాడు.. అనుష్క కామెంట్స్..

తనపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న డేటింగ్ రూమర్స్ పై మలైకా అసహనం వ్యక్తం చేసింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఇలాంటి వార్తలు తనకు మొదట్లో చిరాకు తెప్పించేవని.. కానీ ఇప్పుడు వాటిని చూసి తాను తన కుమారుడు అర్హాన్ ఖాన్ నవ్వుకుంటున్నామని అన్నారు. ఎవరితో కనిపించినా వెంటనే వారితో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు రాయం ఒక అలవాటుగా మారిందని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Actor : అందంగా లేని హీరోని పెట్టి తీయడం వల్లే ఆ సినిమా ప్లాప్ అయ్యింది.. నటుడు రవిబాబు..

చిన్నప్పటి నుంచి తాను ఎవరిపైనా ఆధారపడి బతకలేదని.. స్వయంకృషితో ఎదిగిన మహిళని అని.. తన ఉనికి చాటుకోవడానికి.. లేదా తనను తాను పరిపూర్ణం చేసుకోవడానికి పురుషుడు అవసరం లేదని అన్నారు. తోడు ఉండడం అవసరమే.. కానీ ప్రస్తుతం తాను అందుకు వెతకడం లేదని… ఒకవేళ భవిష్యత్తులో ఎవరితోనైనా ఉండాలనిపిస్తే అది తన వ్యక్తిగత నిర్ణయం కాబట్టి ఎవరితో చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రస్తుతం మలైకా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Aadi Movie: ఆది సినిమాలో ఎన్టీఆర్ జోడిగా ఆ హీరోయిన్ చేయాల్సింది.. తనని వెళ్లి అడిగితే ఏం జరిగిందంటే.. డైరెక్టర్ వివి వినాయక్..

 

View this post on Instagram

 

A post shared by Karishma Patidar (@stylebykarishmaa)

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: సైకో భర్తతో కన్నీళ్ల కాపురం.. భార్యతో బలవంతపు శృంగారం.. ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సినిమా..