
హైదరాబాద్ సిటీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నగరంలో కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేటలో శనివారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. ఓ బైక్ మెకానిక్ షాప్‌లో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తర్వాత షాప్ మొత్తం వ్యాపించి భారీగా మంటలు ఎగిసిడ్డాయి. వెంటనే షాప్ సిబ్బంది.. పోలీసులకు, అగ్నిప్రమాద సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని ఫైరింజన్ తో సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగి ఉండోచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. షాప్ పూర్తిగా ధ్వంసం కావడంతో ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.