ప్రస్తుత పరిస్థితుల్లో ఆధార్ కార్డు అనేది ప్రతీ పనికి అత్యవసర డాక్యుమెంట్‌గా మారిపోయింది. దీంతో ఎప్పుడూ దీనిని వెంట పెట్టుకోవాల్సి వస్తుంది. ఫిజికల్ డాక్యుమెంట్‌ను వ్యాలెట్‌లో ఉంచుకోవడమో లేదా సాఫ్ట్ కాపీని ఫోన్లో ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యం. ఒకవేళ మీరు ఇంట్లో ఆధార్ మర్చిపోయినా లేదా ఫోన్లో అందుబాటులో లేకపోయినా సింపుల్‌గా వాట్సప్ ద్వారా సెకన్లలోనే పొందవచ్చు.
వాట్సర్ ద్వారా ఆధార్ కార్డును డౌన్ లోడ్ చేసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. మై గోవ్ హెల్ప్ డెస్క్ ద్వారా ఈ సదుపాయం ఉంది. ఇందుకోసం ఒక వాట్సప్ నెంబర్‌ను ప్రవేశపెట్టారు. 9013151515 నెంబర్‌కు వాట్సప్‌లో హాయ్ అనే మెస్సేజ్ చేయడం ద్వారా సులువుగా ఆధార్ పొందవచ్చు. పీడీఎఫ్ ఫైల్లో ఆధార్ పొందవచ్చు.
కానీ వాట్సప్ ద్వారా ఆధార్ డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ మొబైల్ నెంబర్ ఆధార్‌కు లింక్ అయి ఉండాలి. ఇక డిజిలాకర్‌లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వారా మీరు అర నిమిషంలోనే ఆధార్ వాట్సప్ ద్వారా పొందవచ్చు. ఈ ప్రాసెస్ ద్వారా మీరు ఎక్కడినుంచైనా, ఎప్పుడైనా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
91-9013151515 నెంబర్‌కు వాట్సప్‌లో హాయ్ లేదా నమస్తే అని మెస్సేజ్ చేయండి. డిజిలాకర్ సర్వీసెస్‌ను ఎంచుకోండి. మీ 12 అంకెల ఆధార్ నెంబర్ నమోదు చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయండి. మీ డిజిలాకర్‌లో ఆధార్‌ను సెలక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ ఆధార్ పీడీఎఫ్ ఫార్మట్‌లో వాట్సప్‌కు అందుతుంది.
మీ మొబైల్ నెంబర్ యాక్టివ్‌గా ఉండాలి. ఆధార్ డిజిలాకర్‌తో లింక్ అయి ఉండాలి. మీ ఆధార్‌కు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఈ మూడు ఉంటేనే వాట్సప్‌లో ఆధార్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.




