కేంద్ర ప్రభుత్వం వాట్సప్, టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియా మెస్సెజింగ్ యాప్స్ వాడేవారికి ఊరట కలిగించనుందని తెలుస్తోంది. సైబర్ నేరాలను అరికట్టేందుకు స్నాప్ చాట్, వాట్సప్, టెలిగ్రామ్ లాంటి యాప్స్‌కు సిమ్ బైండింగ్ నిబంధనలను కేంద్రం తప్పనిసరి చేసింది. అంటే ఫోన్లో సిమ్ కార్డు ఉంటేనే యాప్స్ పనిచేస్తాయి. సిమ్ కార్డు తీసివేస్తే ఉపయోగించుకోవడం కుదరదు
సిమ్ బైండింగ్ నిబంధలను అమలు చేసేందుకు సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం మూడు నెలల గడువు విధించింది. ఆ తర్వాత సిమ్ లేని ఫోన్లలో సేవలను నిలిపివేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఈ నిబంధనను తప్పనిసరిగ్గా పాటించడానికి మరికొంత సమయం కావాలని కేంద్రంను సోషల్ మీడియా సంస్థలు కోరాయి.
ఈ క్రమంలో కంపెనీల వినతి మేరకు సిమ్ బైండింగ్ నిబంధలను అమలు చేసేందుకు గడవును కేంద్రం పెంచనుందని తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ వరకు పొడిగించాలని సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. గత ఏడాది నవంబర్‌లో కొత్త రూల్స్‌ను కేంద్రం తీసుకురాగా.. 90 రోజుల సమయం ఇచ్చింది. అయితే దీనిని అమలు చేసేందుకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తు్న్నాయని, టెస్టింగ్, ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని టెక్ కంపెనీలు చెబుతున్నాయి.
ఈ సమస్యల క్రమంలో సిమ్ బైండింగ్ రూల్స్ అమలు చేయాలంటే సమయం పడుతుందని కేంద్రానికి తెలియజేశాయి. టెక్నికల్ సమస్యలను అధిగమించి అమలు చేయాలంటే టైమ్ పడుతుందని వినతులు అందించాయి. దీంతో కేంద్రం సోషల్ మీడియా సంస్థల వినతులను పరిశీలించి చర్యలు చేపట్టేందుకు సిద్దమైంది. గడువును మరింత పొడిగించేందుకు సిద్దమైందని వార్తలు వస్తున్నాయి.
కేంద్రం ఇచ్చిన గుడవును ఫిబ్రవరి 28తో ముగిసింది. దీంతో మార్చి 1 నుంచి సిమ్ కార్డు లేని ఫోన్లలో వాట్సప్, టెలిగ్రామ్, స్నాప్ చాట్, అరట్టై లాంటి యాప్స్ ఆగిపోతాయని అందరూ భావించారు. కానీ వాటి సేవలు ఇంకా నిలిచిపోలేదు. దీంతో సిమ్ బైండింగ్ రూల్స్ ఇంకా అమల్లోకి రాలేదని అర్థమవుతుంది.




