
టాలీవుడ్ హీరో నితిన్ పుట్టినరోజు (మార్చి 30, 2026) సందర్భంగా కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నితిన్ మరో ప్రాజెక్ట్ చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఇప్పటికే ఇదే బ్యానర్‌లో వచ్చిన ‘భీష్మ’, ‘రంగ్ దే’ సినిమాలతో సక్సెస్ అందుకున్న నితిన్, ఈ కొత్త ప్రాజెక్ట్‌తో మళ్లీ ఫామ్‌లోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న 43వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాను ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నట్లు సమాచారం.
Wishing the ever-energetic @actor_nithiin garu a fantastic birthday 🥳🔥
Team #ProductionNo43
Journey Begins soon. Stay tuned… big things ahead 🤗 pic.twitter.com/v36uvNlgqB— Sithara Entertainments (@SitharaEnts) March 30, 2026
ప్రస్తతం నితిన్ తన 36వ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ V. I. ఆనంద్ రూపొందిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్, నితిన్ కెరీర్‌లో అత్యంత ఆసక్తికర చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
NO BODY…NO RULES
The rules of reality just changed. Very eager to start the journey with my brother @Dir_VI_Anand & @srinivasaaoffl garu 😊
@SS_Screens pic.twitter.com/hrO6GRMPvq
— nithiin (@actor_nithiin) January 25, 2026
అలాగే, నితిన్ మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్. ‘ఆయ్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న డైరెక్టర్ అంజి చెప్పిన కథకు నితిన్ ఇంప్రెస్ అయ్యాడట. ఈ చిత్రాన్ని నితిన్ తన సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై నిర్మించనున్నట్లుగా తెలుస్తోంది. జూలై నుంచి షూటింగ్ ప్రారంభించి, వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం వరుస ప్లాప్స్తో ఉన్న నితిన్, ఈ కొత్త ప్రాజెక్ట్‌లతో స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ కోసం ప్రయత్నిస్తున్నాడు.
►ALSO READ | Viral Video: వెంకీమామ సింప్లిసిటీ వైరల్.. సామాన్యుడిలా హోటల్లో బ్రేక్‌ఫాస్ట్.. నెటిజన్స్ ఫిదా
నితిన్ వరుస ఫెయిల్యూర్స్:
నితిన్ విషయానికి వస్తే.. వరుస ఫెయిల్యూర్స్ తో సతమతం అవుతున్నాడు. ఇటీవలే మాచెర్ల నియోజకవర్గం, ఎక్సట్రా, రాబిన్ హుడ్, తమ్ముడు వంటి వరుస మూవీస్తో ఘోరపరాజయాలను చవిచూశాడు. ఇపుడీ ఈ కొత్త సినిమాల పైనే నమ్మకం పెట్టుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే కంటెంట్ సెలెక్ట్ చేసుకుని వస్తున్నట్లుగా సమాచారం. ఒకవేళ ఈ సినిమాలు కూడా నితిన్ కు సక్సెస్ ఇవ్వకపోతే.. ఆపై ఆశలన్నీ గల్లంతే!!