Reading Time: < 1 minute

వరంగల్ జిల్లాలో విషాద ఘటన.. క్లాస్ రూమ్లోనే గుండెపోటుతో కుప్పకూలిన టీచర్.. స్పాట్ డెడ్ !

Caption of Image.

వరంగల్ జిల్లా: పర్వతగిరి మండలం టూక్య నగర్ ప్రైమరీ స్కూల్లో విషాద ఘటన జరిగింది. ఉపాధ్యాయుడు పోశాల చంద్రశేఖర్ (46)  గుండెపోటుతో మృతి చెందాడు. క్లాస్ రూమ్లో ఛాతిలో నొప్పితో చంద్రశేఖర్ కుప్పకూలాడు. హుటాహుటిన నెక్కొండలోని హాస్పిటల్కు ఆయనను తరలించారు.

చంద్రశేఖర్ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. చంద్రశేఖర్కు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. స్వస్థలం సంగం మండలం కాట్రపల్లి. గతంలో గోరు గుట్ట తండా స్కూల్ హెడ్మాస్టర్గా చంద్రశేఖర్ పనిచేశాడు. కరోనా తర్వాత ఈ సడన్ హార్ట్ అటాక్స్ పెరిగిపోయాయి.

గుండెపోటుకు మొదటి, అత్యంత సాధారణ సంకేతం ఛాతీ నొప్పి. దీన్ని ఛాతీపై ఒత్తిడి, బిగుతుగా అనిపించడం, బరువుగా ఉండటం, కేవలం నొప్పిగా కూడా అనిపించడం.  ఛాతీలో ఏదైనా అసౌకర్యంగా అనిపించి, అది కొన్ని నిమిషాల తర్వాత కూడా తగ్గకపోతే, ముఖ్యంగా భుజాలు, చేతులు,  దవడకు నొప్పి పాకినట్లయితే ఇది చాలా ఆందోళన కలిగించే సంకేతం అని వైద్యులు తెలిపారు.

నిజానికి సైలెంట్ ​హార్ట్​ ఎటాక్​ అనేది ‘సైలెంట్’ కానేకాదు. నార్మల్​ హార్ట్​ఎటాక్​ వచ్చినప్పుడు ఛాతి భాగంలో తట్టుకోలేనంత నొప్పి ఉంటుంది. వాళ్లని వెంటనే హాస్పిటల్​కి తీసుకెళ్లాలి. అదే ఛాతిలో తీవ్రమైన నొప్పి, ఒత్తిడిగా అనిపించడంతో పాటు మెడ, చేతి, అరచేతి నొప్పి రావడం, మగతగా ఉండడం, చెమటలు పట్టడం లాంటి లక్షణాలు ఏవీ కూడా సైలెంట్​ హార్ట్ ఎటాక్​లో కనిపించవు. అందుకే, చాలామంది వీటి​ని తరచూ వచ్చే అసౌకర్యం అనుకోవాలో లేదా గుండెపోటు సంకేతం అనుకోవాలో తెలియక అయోమయానికి లోనవుతారు.

►ALSO READ | గిగ్ వర్కర్లను పట్టించుకోకపోతే అగ్రిగేటర్లకు పెనాల్టీ : మంత్రి వివేక్ వెంకటస్వామి 

©️ VIL Media Pvt Ltd.