
హైదరాబాద్: దేశంలోని చట్టాలను అధ్యయనం చేసి పకడ్బందీ వ్యవస్థ తీసుకొస్తామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈగల్, హైడ్రా తరహాలో ఆహార కల్తీ నియంత్రణకు సరికొత్త వ్యవస్థ తీసుకొస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పంటకు ధర నిర్ణయించే అవకాశం రైతులకు లేకుండా పోయిందని, రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని దళారులు దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. రైతుల హక్కులను కాపాడేందుకు కనీస మద్దతు ధర చట్టం తెచ్చామని తెలియజేశారు. నిత్యావసరాలను అక్రమంగా నిల్వ ఉంచడం హత్యానేరం కంటే ఎక్కువని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.