తెలుగు ముద్దుగుమ్మ ఈషా రెబ్బా ఎప్పటి నుంచో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తుంది. వరుసగా సినిమాలు చేస్తున్నా హిట్స్ మాత్రం అందుకోలేకపోతోంది ఈ చిన్నది. హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే సెకండ్ హీరోయిన్ గానూ నటిస్తూ మెప్పిస్తుంది.
చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ వయ్యారికి ఇప్పటివరకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు. అలాగే పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. ఒక్క హిట్ పడితే కెరీర్ టర్న్ అవుతుందని ఎదురుచూస్తుంది ఈ అందాల భామ.
అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. ఆతర్వాత వరుసగా అమీ తుమీ, విస్మయం, బ్రాండ్ బాబు వంటి చిత్రాల్లో నటించింది. కానీ అనుకుంత గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమాలో నటించింది.
ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ మూవీలోనూ మెరిసింది. కానీ ఈ సినిమా హిట్ అయినప్పటికీ ఈషాకు అంతగా క్రేజ్ రాలేదు. ఆతర్వాత వెబ్ సిరీస్ ల్లోనూ నటించింది ఈ అందాల భామ. ఇక ఇటీవలే తరుణ్ భాస్కర్ తో కలిసి సినిమా చేసింది. కానీ ఈ సినిమా కూడా ఆకట్టుకోలేకపోయింది.
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. చీరకట్టులో అదరగొట్టింది.




