Reading Time: 2 minutes
Vedanta Demerger One Share To Six Shares Anil Agarwal Announcement New Companies

Vedanta Demerger: ప్రముఖ మైనింగ్, మెటల్స్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ పెట్టుబడిదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. కంపెనీ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ వేదాంత గ్రూపులో భారీ డీమెర్జర్ ప్రక్రియను ధృవీకరించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రక్రియ ద్వారా వేదాంత లిమిటెడ్ ఐదు కొత్త స్వతంత్ర కంపెనీలుగా విడిపోనుందని తెలిపారు. నిజానికి ఈ డీమెర్జర్ ప్రక్రియ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోను భారీగా పెంచనుంది. ప్రస్తుతం మీ దగ్గర వేదాంత లిమిటెడ్‌కు చెందిన ఒక్క షేరు ఉంటే, డీమెర్జర్ పూర్తయిన తర్వాత మీ వద్ద మొత్తం 6 షేర్లు ఉంటాయి.

READ ALSO: Hema: హేమకు క్లీన్ చీట్.. చనిపోవాలి అనుకున్నానంటూ షాకింగ్ కామెంట్స్!

కొత్తగా రాబోతున్న 5 కంపెనీలు ఇవే:
వ్యాపార కార్యకలాపాలను సరళీకృతం చేసేందుకు అనిల్ అగర్వాల్ వేదాంతను కింది ఐదు విభాగాలుగా విడగొడుతున్నట్లు తెలిపారు.

* వేదాంత అల్యూమినియం: అల్యూమినియం ఉత్పత్తి, వ్యాపారం.

* వేదాంత ఆయిల్ & గ్యాస్: చమురు, సహజ వాయువు రంగం.

* వేదాంత స్టీల్ & ఫెర్రస్: ఇనుము, ఉక్కు వ్యాపారం.

* వేదాంత బేస్ మెటల్స్: రాగి, జింక్ వంటి లోహాలపై దృష్టి.

* వేదాంత పవర్: విద్యుత్ ఉత్పత్తి రంగాన్ని పర్యవేక్షిస్తుంది.

ఈ ఐదు కంపెనీలకు మాతృ సంస్థ అయిన వేదాంత లిమిటెడ్ ఇకపై కేవలం పెట్టుబడులు, సెమీకండక్టర్ల వంటి భవిష్యత్ టెక్నాలజీ ప్రాజెక్టులపై మాత్రమే దృష్టి సారిస్తుందని తెలిపారు.

ఈ భారీ నిర్ణయానికి కారణం ఇదే..
వేదాంత ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 2025 డిసెంబర్ నాటికి కంపెనీపై రూ.60,624 కోట్ల అప్పు ఉంది. రాబోయే మూడేళ్లలో సుమారు $3 బిలియన్ల రుణాన్ని తగ్గించుకోవాలని అనిల్ అగర్వాల్ లక్ష్యంగా పెట్టుకున్నారు. విడిపోయిన కంపెనీలలో వాటాలను విక్రయించడం ద్వారా ఈ అప్పు తీర్చడం సులభమవుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారని సమాచారం. ప్రస్తుతం ఉన్న $27 బిలియన్ల మార్కెట్ క్యాప్, ఐదు కంపెనీలు విడిపోయిన తర్వాత అంతకంటే ఎక్కువ విలువను సంతరించుకుంటుందని కంపెనీ ఆశిస్తోంది. ఇప్పటివరకు ఆయిల్, గ్యాస్, పవర్ వంటి అన్ని వ్యాపారాలన్నీ ఒకే గొడుగు కింద ఉండేవి. ఇకపై ఇన్వెస్టర్లు తమకు నచ్చిన రంగంలో (ఉదాహరణకు కేవలం పవర్ లేదా ఆయిల్ రంగంలో మాత్రమే) పెట్టుబడి పెట్టే అవకాశం లభిస్తుంది. ప్రతి కంపెనీకి ప్రత్యేక బోర్డ్, యాజమాన్యం ఉండటం వల్ల నిర్ణయాలు వేగంగా జరిగి లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ వేదాంత ఇన్వెస్టర్లకు ఒక లాటరీ వంటిదని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అప్పుల బాధ నుంచి విముక్తి పొంది, కొత్త కంపెనీలతో వేదాంత గ్రూప్ స్టాక్ మార్కెట్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తుందో లేదో చూడాలి.

READ ALSO: Nisha Mehta: నేపాల్ ఆరోగ్య మంత్రిగా ఢిల్లీ ఎయిమ్స్ విద్యార్థి..!