Reading Time: < 1 minute

ఒకప్పుడు మిస్టరీ స్పిస్నర్‌గా ఓ వెలుగు వెలిగిన వరుణ్ చక్రవర్తి ప్రస్తుతం ఫామ్ లేమీతో బాధపడుతున్నాడు. ఐపిఎల్‌ 19వ సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 48 పరుగులు సమర్పించుకున్నాడు. కానీ, ఒక్క వికెట్ కూడా తీయేలేకపోయాడు. ఈ విషయంలో వరుణ్‌పై విమర్శలు కురుస్తున్నాయి. తాజాగా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ వరుణ్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. వరుణ్ మిస్టరీ ఇక హిస్టరీగా మారిపోయిందని అన్నారు.

‘‘బంతిని విభిన్నంగా వేయడం, లెగ్ స్పిన్ సంధించగాన్ని నేర్చుకోనంత వరకు వరుణ్ చక్రవర్తి ఇబ్బంది పడుతూనే ఉంటాడు. ఎప్పుడూ గూగ్లీలు వేయడం వర్కౌట్ కాదు. బౌలింగ్‌లో వేరియేషన్ చూపించాలి. కొన్నిసార్లు లెగ్ స్పిన్ వేయాలి. అప్పుడి బాలింగ్‌లో ఎలాంటి మిస్టరీల లేదు. అదంతా హిస్టిరీగా మారిపోయింది. బ్యాటర్లకు బంతి కాస్త దూరంగా వేయాలి.. అప్పుడు షాట్‌లకు ప్రయత్నించి ఔట్ అవుతారు. దీంతో తర్వాత వచ్చే బ్యాటర్లు కాస్త జంకుతారు. ఇక్కడ ఆయా జట్ల సారథులనకూ ఓ మాట చెబుతున్నా.. ఇప్పుడు వరుణ‌్‌కు పవర్‌ప్లేలో బౌలింగ్ ఇవ్వదు. మంబైతో మ్యాచ్‌లో రోహఇిత్ శర్మ ఇలానే వరుణ్ వేసిన తొలి ఓవర్‌లోనే దూకుడుగా పరుగులు రాబట్టాడు. దాంతో వరుణ్ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది’’ అని శ్రీకాంత్ అన్నారు.