
ఇరాన్ దేశానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. చెప్పినట్లు వినండి.. వినకపోతే ఇరాన్ దేశంలో విధ్వంసం తప్పదంటూ వార్నింగ్ ఇచ్చేశారు ట్రంప్.
మీ డిమాండ్లు చర్చించే విధంగా లేవు.. నేను చెప్పినట్లు వినండి అంటూ హితబోధ చేస్తూనే.. వెంటనే హర్మూజ్ జల సంధిని తెరవాలని.. నౌకల రాకపోకలకు అనుమతి ఇవ్వాలంటూ ఇరాన్ కు అల్టిమేటం ఇచ్చారు ట్రంప్.
అమెరికా డీల్ కు ఒప్పుకోవాలని.. అలా జరకపోతే ఇరాన్ దేశంలోని విద్యుత్ ప్లాంట్లను ధ్వంసం చేస్తామని.. ఆయిల్ బావులు.. ఇంధన రిఫైనరీలను నేల మట్టం చేస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ట్రంప్.
ఇంధన రిఫైనరీలే కాదు.. విద్యుత్ ప్లాంట్లు మాత్రమే కాదు.. మౌలిక వసతులను సైతం తుడిచిపెట్టేస్తానని.. ఇదే ఫైనల్ వార్నింగ్ అంటూ చెప్పుకొచ్చారు ట్రంప్.
ఇప్పటికే అమెరికా బలగాలు ఆదేశాల కోసం వేచి చూస్తున్నాయని.. మేం చెప్పినట్లే.. మా డిమాండ్లకు అనుగుణంగా ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేసిన ట్రంప్.. ప్రతీకారం చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారాయన.
చర్చలు వెంటనే కొలిక్కిరావాలని.. చర్చలు విఫలం అయిన మరుక్షణం దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటారని.. దీనికి బాధ్యత ఇరాన్ దే అంటూ తన వైఖరిని స్పష్టం చేశారు ట్రంప్.
ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం 2026, మార్చి 30వ తేదీకి 31వ రోజుకు చేరుకున్నది.