
బాలీవుడ్ వెండితెరపై తనదైన శైలిలో మెప్పించిన నటి సోనమ్ కపూర్ ఇంట ప్రస్తుతం పండగ వాతావరణం నెలకొంది. గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటూ కుటుంబ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది. మార్చి 29, 2026 ఆదివారం రోజున సోనమ్ కపూర్ – ఆనంద్ ఆహుజా దంపతులకు రెండో సంతానంగా మగ శిశువు జన్మించాడు. లేటెస్ట్ గా ఈ తీపి కుబురును సోనమ్ తన అభిమానులకు తెలిపింది.
కుటుంబంలోకి కొత్త వెలుగు
ఈ సంతోషకరమైన వార్తను సోనమ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. మా కుటుంబం ఇప్పుడు మరింత పెద్దదైంది. ఈ చిన్ని ప్రాణం రాకతో మా హృదయాలు ప్రేమతో నిండిపోయాయి. తన తమ్ముడిని ఆహ్వానించడానికి మా పెద్దబ్బాయి వాయు ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. మా ఇంటిని సంతోషంతో, ఆశీర్వాదంతో నింపిన ఈ కొత్త సభ్యుడికి స్వాగతం. నలుగురు సభ్యుల కుటుంబంగా మా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఎంతో ఆత్రుతగా ఉన్నాం అంటూ సోనమ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
నలుగురు సభ్యుల అందమైన లోకం
సోనమ్ కపూర్, ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ ఆహుజాని 2018లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి 2022లో మొదటి సంతానంగా వాయు కపూర్ ఆహుజా జన్మించాడు. ఇప్పుడు సరిగ్గా నాలుగేళ్ల తర్వాత మరో బాబు రావడంతో అటు అహుజా కుటుంబంలో, ఇటు అనిల్ కపూర్ నివాసంలో వేడుకలు మొదలయ్యాయి. తాతగా అనిల్ కపూర్ మరోసారి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
►ALSO READ | Nithiin New Movie: డూ ఆర్ డై సిట్యువేషన్‌లో నితిన్.. బర్త్ డే స్పెషల్గా కొత్త సినిమా అనౌన్స్..
శుభాకాంక్షల వెల్లువ
సోనమ్ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే బాలీవుడ్ సినీ ప్రముఖులు కరీనా కపూర్, మలైకా అరోరా, ప్రియాంక చోప్రా వంటి స్టార్స్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఫ్యాషన్ ప్రపంచంలో సోనమ్ చేసిన ప్రయోగాలు ఎంత పాపులరో, ఆమె మాతృత్వానికి సంబంధించిన ఫోటో షూట్లు కూడా అంతే ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. సోనమ్ చివరిగా ‘బ్లైండ్’ (Blind) అనే థ్రిల్లర్ చిత్రంలో నటించింది. ఆ తర్వాత తన పూర్తి సమయాన్ని పిల్లల పెంపకం కోసమే కేటాయించారు. ప్రస్తుతానికి ఆమె ఏ కొత్త ప్రాజెక్టులకూ సంతకం చేయలేదని సమాచారం. మొదటి బాబుకు ‘వాయు’ అని అర్థవంతమైన పేరు పెట్టిన ఈ జంట, రెండో బాబుకు కూడా అంతే విభిన్నమైన పేరును ఖరారు చేసే అవకాశం ఉంది.