Reading Time: 2 minutes

ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్: యూపీఐ నుంచి రైలు టిక్కెట్ల వరకూ వస్తున్న మార్పులు ఇవే..

Caption of Image.

ఏప్రిల్ 1, 2026 నుంచి భారతీయుల ఫైనాన్షియల్ లైఫ్‌లో కొత్త మార్పులు రాబోతున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంతో పాటే ఆదాయపు పన్ను, బ్యాంకింగ్, రైల్వే, కార్మిక చట్టాల్లో కీలక సవరణలు అమలులోకి రానున్నాయి. సామాన్యుడి జేబుపై ప్రభావం చూపే ఆ ముఖ్యమైన మార్పులకు సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం..

ఆదాయపు పన్ను చట్టం, 2025:
పాత 1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త ‘ఆదాయపు పన్ను చట్టం, 2025’ అమలులోకి రానుంది. ఇందులో సెక్షన్ల సంఖ్య 819 నుండి 536కు, చాప్టర్ల సంఖ్య 47 నుండి 23కు తగ్గించారు. పన్ను నిబంధనలు 399 నుండి 190కి, ఫారమ్‌ల సంఖ్యను 511 నుండి 333కి తగ్గించి సరళీకరించారు. ఇకపై ఫారమ్‌లన్నీ ఒకేలా ఉండి. డేటా ఆటో-ఫిల్ అయ్యే సౌకర్యం ఉంటుంది.

కొత్త లేబర్ కోడ్స్ – జీతాల్లో మార్పు:
కొత్త కార్మిక చట్టాల ప్రకారం ఉద్యోగి బేసిక్ పే మొత్తం జీతంలో కనీసం 50% ఉండాలి. దీనివల్ల పీఎఫ్ కాంట్రిబ్యూషన్ పెరిగి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మెరుగుపడతాయి. అయితే చేతికి వచ్చే జీతం మాత్రం తగ్గనుంది. అలాగే సెలవుల కోసం కనీసం 240 రోజులు పనిచేయాలన్న రూల్ ఇప్పుడు 180 రోజులకు తగ్గించారు. గ్రాట్యుటీ ప్రయోజనాలు కూడా పెరగనున్నాయి.

పాన్- ఆధార్ రూల్స్:
ఏప్రిల్ 1 నుండి పాన్ కార్డుపై పేరు ఉండదు. కేవలం ఆధార్‌లోని వివరాల ప్రకారమే పాన్ చెల్లుబాటు అవుతుంది. పాన్ దరఖాస్తుకు కేవలం ఆధార్ ఒక్కటే సరిపోదు. పుట్టిన తేదీ ధ్రువీకరణ కోసం 10వ తరగతి సర్టిఫికేట్ లేదా పాస్‌పోర్ట్ తప్పనిసరి. ఇక పన్ను చెల్లింపుదారులకు ఊరటనిస్తూ.. ITR-3, ITR-4 ఫైలింగ్ గడువును ఆగస్టు 31 వరకు పొడిగించబడింది.

►ALSO READ | ఉద్యోగం ఉంది.. జీతం వస్తుంది అయినా.. : అప్పులు, ఆందోళనలతో జీవితాలు నెట్టుకొస్తున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్

బ్యాంకింగ్ అండ్ యూపీఐ ఛార్జీలు:
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏటీఎంలలో 5 ఉచిత లావాదేవీల తర్వాత యూపీఐ ద్వారా క్యాష్ విత్‌డ్రాయల్‌పై రూ.23 ఛార్జీ వసూలు చేయనుంది. బంధన్ బ్యాంక్ కూడా మెట్రోల్లో 3, నాన్-మెట్రోల్లో 5 ఉచిత లావాదేవీల తర్వాత రూ.23 ఛార్జీని, బ్యాలెన్స్ లేక ఫెయిల్ అయిన ట్రాన్సాక్షన్‌కు రూ.25 వసూలు చేయనుంది.

ఇతర ముఖ్యమైన మార్పులు:

* రైల్వే: ప్రయాణానికి 8 గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే రూపాయి కూడా రీఫండ్ రాదు. అంతకుముందు ఈ గడువు 4 గంటలుగా ఉండేది.

* SGB: రిజర్వ్ బ్యాంక్ నుంచి నేరుగా కొనని సావరిన్ గోల్డ్ బాండ్లపై ఇక నుంచి క్యాపిటల్ గెయిన్ టాక్స్ పడుతుంది.

* FASTag: ఇయర్లీ పాస్ ధర రూ.3వేల నుంచి రూ.3వేల 075కు పెరిగింది.

* LPG: యుద్ధ వాతావరణం నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే అవకాశం ఉంది.

* TDS: ఫారమ్ 16, 16A స్థానంలో కొత్తగా ఫారమ్ 130, 131 రానున్నాయి. HRA క్లెయిమ్ చేయాలంటే యజమాని పాన్ వివరాలు, అద్దె రశీదులు సమర్పించడం తప్పనిసరి.

©️ VIL Media Pvt Ltd.